దేశంలోనే తొలి మొబైల్ వైరాలజి ల్యాబ్ ప్రారంభం.

దేశంలోనే తొలి మొబైల్ వైరాలజి ల్యాబ్ ప్రారంభం.

by Anudeep

Ads

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా తాకిడికి అల్లకల్లోలమవుతున్నాయి. మనదేశం మాత్రం ముందస్తుగా లాక్ డౌన్ ప్రకటించింది. అయినప్పటికి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కావాలసిన అన్ని రకాల చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా మొబైల్ వైరాలజి ల్యాబ్ ని ప్రారంభించారు..దేశంలోనే తొలి మొబైల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ను ప్రారంభించిన కేంద్రమంత్రులు మరియు తెలంగాణ మంత్రి కెటిఆర్.

Video Advertisement

ఇప్పటివరకు వైరాలజికి సంబంధించిన ఏ టెస్టుకైనా పూణెలోని వైరాలజి సంస్థపై ఆధారపడేవాళ్లం.. ఇక్కడ సాంపిల్స్ తీసుకుని వాటిని పూనె పంపించి , ఆ రిపోర్ట్స్ కోసం పది, పదిహేను రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి . కాని ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా 302  టెస్టింగ్ లాబ్స్ ఏర్పాటు చేసారు.వాటిల్లో ప్రభుత్వ పరంగా 215 ,ప్రైవేట్ పరంగా 87 లాబ్ లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ వైరల్ రీసెర్చ్ ల్యాబ్ ఫలితంగా మరింత మెరుగైన సదుపాయాలు పొందే అవకాశం ఉంది.

కరోనా పై పోరులో డిఆర్డీఓ గొప్ప పాత్ర పోషిస్తుంది . అంతేకాదు కరోనా పై పోరాడేందుకు ESIC సామర్థవంతమైన చర్యలు తీసుకుంటుంది .దేశంలో 1042 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు తో పాటు 8 ESIC ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులుగా మార్చారు.కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా 755 కోవిడ్ హాస్పిటల్స్ ను ప్రత్యేకంగా  ఏర్పాటు చేసింది ప్రభుత్వం .దేశంలో 1,86000 బెడ్స్ ను సిద్దంగా ఉంచింది..దేశవ్యాప్తంగా 3060 క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయి.1400 హెల్త్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేసారు.

అంతేకాదు దేశానికి కావాల్సిన పీపీఈ కిట్స్ ను ఇంతకు ముందు అత్యదిక ధరకు విదేశాల నుండి దిగుమతి చేసుకునేవాళ్లం. కాని ఇప్పుడు మన దగ్గరే చవకైన ధరకి తయారు చేసుకోగలుగుతున్నాం..వెంటిలేటర్లను తయారు చేసుకుంటున్నాం.ఇదంతా కూడా ప్రభుత్వాల కృషి ఫలితమే. ప్రభుత్వాలు వాటి పని అవి సమర్దవంతంగా చేసుకుంటూ వెళ్తున్నాయి . ప్రజలుగా మనం లాక్ డౌన్ బాద్యతగా పాటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడగలగాలి.

 


End of Article

You may also like