Ads
సుచంద్రిమా పాల్.. నిన్న మొన్నటి వరకు ఈమె చెప్తే వార్త..ఇప్పుడు ఈమె వార్తల్లో వ్యక్తి అయ్యారు..ప్రధానితో భేష్ అనిపించుకోవడం అంటే చిన్న విషయం కాదు…ఆమె ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ చూసే చలించిపోయానని ఒక జర్నలిస్ట్ ని , తన వర్క్ ని ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోదీ..వెంటనే సుచంద్రిమాకి కాల్ చేసి అభినందించారు..
Video Advertisement
పశ్చిమ బెంగాల్ కి చెందిన మహిళా జర్నలిస్ట్ సుచంద్రిమా పాల్..ఎప్పటిలానే తన డ్యూటీ చేశారు..కానీ ఈ సారి ఊహించని విధంగా ప్రధాని మోదీ నుండి కాల్ వచ్చింది. ఆంఫాన్ తుఫాన్ ఇటీవల పశ్చిమ బెంగాల్‌ను అతలాకుతలం చేసిన విషయంత తెలిసిందే.. ఒకవైపు కరోనా , మరొవైపు తుఫాన్ తో బెంగాల్ ప్రజలు అష్టకష్టాలు పడ్డారు.. తుఫాన్ కోల్‌కతాను ఏ విధంగా అతలాకుతలం చేసిందనే వార్తలను సుచంద్రిమ పాల్ అందించారు. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో నడుము లోతు నీటిలో దిగి సుచంద్రిమ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు.
కోల్‌కతా కి చెందిన న్యూస్ ఛానెల్లో సుచంద్రిమ ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ చూసి తాను చలించిపోయానని, వెంటనే బాధిత ప్రాంతాలను సందర్శించానని దీనికంతటికి కారణం సుచంద్రిమ రిపోర్టే అని ప్రధాని వెల్లడించారు.. తుఫాన్‌తో కకావికలమైన బెంగాల్‌కు తక్షణ సాయం కింద రూ. 1000 కోట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.దాంతో ప్రధాని మెచ్చుకున్న ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మోదీ తనను ప్రశంసించారు అంటూ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.
End of Article