“నా సినిమాకి అవార్డ్ ఇవ్వకుండా… చెత్త సినిమాకి అవార్డ్ ఇచ్చారు..!” అంటూ… “మోహన్ బాబు” కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“నా సినిమాకి అవార్డ్ ఇవ్వకుండా… చెత్త సినిమాకి అవార్డ్ ఇచ్చారు..!” అంటూ… “మోహన్ బాబు” కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by Anudeep

Ads

సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సాధించుకున్నారు. 47 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న మోహన్ బాబు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా.. నిర్మాతగా అన్ని పాత్రలు పోషించారు. కెరీర్ తొలినాళ్లలో మోహన్ బాబు విలన్ గా నటించాడు. తన మార్క్ విలనిజంతో మెప్పించాడు. విలన్ కు ఒక స్టైల్, మేనరిజమ్స్ అలవాటు చేసిన నటుడు మోహన్ బాబు మాత్రమే.

Video Advertisement

అయితే గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన కుమారులైన మంచు మనోజ్, మంచు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ఇండస్ట్రీ లో మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో తన సినీ కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు మోహన్ బాబు. సినిమా ఇండస్ట్రీలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని అన్నారు. ఒకానొక సమయంలో ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నానని చెప్పారు.

mohan babu about his awards..!!

పరిశ్రమ లోని అవార్డుల గురించి మోహన్ బాబు మాట్లాడుతూ.. “పెదరాయుడు, మనోజ్ నటించిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రాలకు గాను నేను నంది అవార్డులకు అప్లై చేస్తే.. అవార్డులు రాకుండా కొంత మంది అడ్డుకున్నారు. వారికి కావాల్సిన వారికి అవార్డులు ఇచ్చుకున్నారు. చెత్త సినిమాలకు అవార్డులు ఇచ్చారు. ఇదంతా చేసింది ఎవరో కూడా నాకు తెలుసు. కానీ నేను చెప్పను..అయినా మంచి నటుడికి అవార్డులతో పని లేదు, ప్రజల అభిమానమే పెద్ద అవార్డు” అంటూ మోహన్ బాబు వెల్లడించారు.

mohan babu about his awards..!!

కేంద్రం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న మోహన్ బాబు.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజ్యసభ ఎంపీగానూ చేశారు. శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేతగా మోహన్ బాబు రాణిస్తున్నారు. ‘లక్ష్మీప్రసన్న పిక్చర్స్’ స్థాపించి 50కి పైగా చిత్రాలను మోహన్ బాబు నిర్మించారు. ప్రస్తుతం ‘శాకుంతలం’, ‘ఆదిపురుష్’ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

watch video :


End of Article

You may also like