Ads
మలయాళం సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ తెలుగు వారికి కూడా సుపరిచితుడే. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘జనతా గారేజ్’ సినిమా లో నటించిన మోహన్ లాల్ తెలుగువారికి ఎంతో దగ్గరయ్యారు. ఆ తరువాత ఆయన మలయాళం సినిమాలు చూడడానికి తెలుగువారు క్యూ కడుతున్నారు. అయితే, ఆయన ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ సుచిత్రను ప్రేమించారు. పెళ్లి చేసుకున్నారు. వీరికి సంతానం గా విస్మయ జన్మించింది. విస్మయ తో పాటు వీరికి ప్రణవ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.
Video Advertisement
మోహన్ లాల్ కూతురు గా విస్మయ కూడా అందరికి పరిచయమే. ప్రణవ్ కూడా మూడు సినిమాలలో హీరో గా నటించాడు. హీరో గా ప్రణవ్ కు ఇంకా బ్రేక్ రాకపోయినప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే, విస్మయ కూడా సినీ ఇండస్ట్రీ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, విస్మయ చూడడానికి చాలా లావు గా కనిపిస్తారు. ఆమే ను చుసిన వారందరు ఈమె సినిమాల్లో ఎలా నటించి మెప్పిస్తుందంటూ కామెంట్ లు వేశారు. ఓ స్టార్ హీరో కూతురు అయి ఉండీ.. అందం , ఆరోగ్యం పట్ల కొంచం కూడా శ్రద్ధ లేదంటూ ఆమె పై పలు కామెంట్లు వచ్చేవి. మొదట్లో విస్మయ ఇవన్నీ పట్టించుకోలేదు. కానీ ఒకరోజు కఠినమైన నిర్ణయం తీసుకుంది. డైట్ ను పాటిస్తూ, కఠినం గా ఉండే వ్యాయామాలను చేసింది. ఎలా అయినా లావు తగ్గాలని ఉద్దేశం తో, చాలా కష్టపడింది. హఠాత్తుగా అందరిని విస్మయపరిచింది. ఆమె ఇపుడు చాలా నాజూకు గా తయారైంది.
గతం లో ఆమె ను ట్రోల్ చేసినా వారే ఇపుడు ఆమె ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆమె తాను గతం లో ఎలా ఉండేవారో, వ్యాయామాలు చేసి సన్నబడిన తరువాత ప్రస్తుతం ఎలా ఉన్నారో, ఈ రెండు ఫోటోలను జత చేసి ఇంస్టాగ్రామ్ ఖాతా లో ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మోహన్ లాల్ అభిమానులు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపడుతున్నారు. తాను బరువు ఎలా తగ్గనే వివరిస్తూ విస్మయ పోస్ట్ చేసింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ అధిక బరువుని అధిగమించినట్లు తెలిపింది. మొదట్లో చాలా బరువు ఉన్న కారణం గా మెట్లు ఎక్కడం వలన ఊపిరి ఆడేది కాదని, దీనితో ఎలా అయినా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అనుకున్నదే తడవు గా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
ఫాస్ట్ గా నడవడమే కష్టం అయినా తనకు, మార్షల్ ఆర్ట్స్ అంటే మరింత కష్టతరం అవుతుందని ముందే భావించినట్లు పేర్కొంది. కానీ తనకు శిక్షణ ఇచ్చిన వారు చాలా మంచివాళ్ళని, అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం తనకు ఇబ్బంది అవ్వలేదని ఆమె పేర్కొంది. మొదట్లో అసలు మార్షల్ ఆర్ట్స్ చేయలేనేమో అనుకున్నానని, కానీ బరువు తగ్గాలని బలం గా కోరుకోవడం వల్లనే చేయగలిగానని ఆమె చెప్పుకొచ్చారు. నా కోచ్ కూడా ఎంతో సహకరించారు అని ఆమె చెప్పుకొచ్చారు. నేను చేయలేను అనుకున్నప్పుడల్లా కోచ్ పక్కన ఉండి ఎంకరేజ్ చేసేవారని, ఆయన వలెనే బరువు తగ్గానని ఆమె తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
View this post on Instagram
End of Article