అప్పుల పాలైనా ఆ రైతులు ఊరంతా విందు భోజనం పెడతారు.. ఈ వింత ఆచారాన్ని అక్కడ ఎందుకు పాటిస్తారంటే..?

అప్పుల పాలైనా ఆ రైతులు ఊరంతా విందు భోజనం పెడతారు.. ఈ వింత ఆచారాన్ని అక్కడ ఎందుకు పాటిస్తారంటే..?

by Anudeep

Ads

రైతులు, దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటేనే ఒక దేశం అభివృద్ధి పథంగా పయనిస్తూ ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వాలు సైతం రకరకాల పధకాలు అమలు చేస్తూ రైతులకు, ప్రజలకు అండగా నిలుస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పధకాలను అమలు చేస్తూ ఉంటుంది.

Video Advertisement

అయితే.. ఎన్ని పధకాలు వచ్చినా.. ఎంతమంది సాయాలు చేసినా దేశంలో రైతుల పరిస్థితి ఏమీ మారడం లేదు. నిత్యం అప్పులు, వర్షాల్లేకపోతే పంట చేతికి రాక తిప్పలు తప్పడం లేదు.

moi virundu 1

ఈ పరిస్థితిలో రైతులు అప్పులను తీర్చుకోవడం కోసం సహజం గానే బ్యాంకుని ఆశ్రయిస్తారు. లేదంటే వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీకి మళ్ళీ అప్పు చేస్తారు. కానీ, తమిళనాడు రాష్ట్రంలో మాత్రం రైతులు ఊరందరికీ విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఎందుకో తెలుసుకోండి. అప్పుల పాలైన రైతులు ఇలా విందు భోజనాన్ని పెట్టడాన్ని “మోయి విరుందు” అని అంటారు.

moi virundu 2

చినరాయుడు సినిమాలో లాగా తమిళనాడులో “మోయి విరుందు” అనేది తరతరాల నుంచి సంప్రదాయంగా వస్తోంది. తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సంప్రదాయంలో అప్పుల పాలైన రైతులు ఊరంతా ఫ్లెక్సీలు కట్టి, కరపత్రాలను పంచుతూ అందరిని విందుకి ఆహ్వానిస్తారు. వారికి స్వీట్లు, వెరైటీ కూరలు, చికెన్, మటన్ లను కూడా వడ్డిస్తారు. అయితే.. భోజనానికి వచ్చిన వారి వద్ద యాభై రూపాయలనుంచి ఐదు వందల రూపాయల దాకా విరాళాల్ని తీసుకుంటారు.

moi virundu 3

కావేరీ తీరంలో ఉండే ప్రజల్లో ఎక్కువ మంది రైతులే ఉంటారు. వీరు వ్యవసాయం పైనే ఆధార పడి జీవిస్తుంటారు. అప్పులు ఎక్కువ అయితే… వీరు బ్యాంకుల దగ్గరో, లేక వడ్డీ వ్యాపారుల దగ్గరో అధిక వడ్డీకి సొమ్ము తీసుకోరు. ఇలా “మోయి విరుందు” ను ఏర్పాటు చేసి చదివింపులు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం జులై నుంచి అక్టోబర్‌ మధ్య ఈ విందు ఉంటుంది. ఈ విందు ద్వారా వచ్చిన మొత్తంతో అప్పుల నుంచి బయటపడి తిరిగి వ్యవసాయం కొనసాగిస్తారు. కరోనా వలన గత రెండేళ్లుగా ఈ విందుకి బ్రేక్ పడింది. ఇటీవల తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ రెండు నెలల్లోనే విందుల ద్వారా 5వందల కోట్ల రూపాయల వరకు సేకరిస్తారు. అలాగే చదివించిన వారికి రసీదులు కూడా ఇస్తారు. చదివింపులు రాసుకుని, డబ్బుని సేకరించేందుకు ప్రత్యేక సిబ్బంది కూడా ఉంటారు.


End of Article

You may also like