సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక్కోసారి కింద కూడా పడుకుంటాం. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్కువగా ఉన్న సమయాల్లో కింద పడుకుని అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. మధ్యాహ్న సమయాల్లో భోజనాలు అయ్యాక.. కాసేపు అలా టివి చూస్తూ పడుకోవడానికి ఇష్టపడతాం.

Video Advertisement

 

తాజాగా బ్యాంకాక్ లో ఉండే వీళ్ళ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు అందరు అదే పని చేసారు. అందరు భోజనాలు అయ్యాక టీవీ చూస్తూ నడుం వాల్చారు. కాసేపు కునుకు తీసే పనిలో పడ్డారు. అయితే.. వారి చిన్న పిల్ల మాత్రం టివి చూస్తూనే ఉంది.

monitor lizard 1

సాధారణంగా కింద పడుకున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న క్రిమి కీటకాలు వచ్చి చెవిలో దూరే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా వేసుకుని పడుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే వీరి కుటుంబంలో వారు మాత్రం నేలమీదే పడుకున్నారు. ఆ చిన్న పిల్ల టివి చూస్తూ ఉండగా.. ఉన్నట్లుండి ఒక మానిటర్ బల్లి ఇంట్లోకి ప్రవేశించింది.

monitor lizard 2

వారి పక్కనుంచి పాక్కుంటూ ఇంట్లో కి వెళ్ళింది. అందరు నిద్రపోవడంతో దీని గురించి ఎవరికీ తెలియలేదు. అయితే.. ఆ చిన్న పిల్ల ఆ బల్లిని చూసి ఉన్నట్లుండి ఏడవడం మొదలుపెట్టింది. ఆ పిల్ల ఏడుపుకు ఇంట్లో వాళ్ళు అందరు లేచారు. అందరికి మెలకువ వచ్చి చూసేసరికి ఆ బల్లి బయటకు వెళ్ళిపోయింది. కెమెరాలో రికార్డు అవ్వకపోయి ఉంటె ఇది చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Watch Video: