బ్లడ్ సాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి…కరోనా భయాందోళనలలో అక్కడి ప్రజలు! (వీడియో)

బ్లడ్ సాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతి…కరోనా భయాందోళనలలో అక్కడి ప్రజలు! (వీడియో)

by Anudeep

Ads

ఉదయం లేచింది మొదలు కరోనా  భయంతోనే బతుకుతున్నాము..ఎప్పుడు ఎటువైపు నుండి అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ల్యాబ్ టెక్నిషియన్ నుండి కరోనా బ్లడ్ సాంపిల్స్ ఎత్తుకెళ్ళింది ఓ కోతి.. అంతేకాదు.. అతడి నుండి గ్లవుజ్ కూడా ఎత్తుకెళ్లి వాటిని తినేందుకు ప్రయత్నించింది..ఇప్పుడు ఆ కోతి ఎక్కడెక్కడ తిరుగుతుందో.. దాని ద్వారా ఎవరెవరకి కరోనా వ్యాపిస్తుందో అనే భయం మొదలైంది మీరట్ వాసుల్లో.. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది..

Video Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.. ఈ మెడికల్ కాలేజీని కరోనా రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వస్తున్న ల్యాబ్ టెక్నిషియన్ పై అక్కడే చెట్లపై ఉన్న కోతి దాడి చేసి, అతడి నుండి శాంపిల్స్ ని ఎత్తుకుని పారిపోయింది..గ్లౌవుజ్ కూడా తీసుకుని వెళ్లి చెట్టెక్కి కూర్చుంది.. దాంతో అక్కడున్న వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.. కోతి తీసుకెళ్లిన బ్లడ్ శాంపిల్స్, గ్లౌవుజ్ ల ద్వారా కరోనా వ్యాపిస్తుందేమో..కోతి నుండి ఎంతమందికి వస్తుందో అనే కొత్త రకం భయంపట్టుకుంది.

ఇదే విషయంపై మీరట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్కె గార్గ్ మాట్లాడారు.. “కోతి ఎత్తుకెళ్లిన శాంపిల్స్ కరోనా పేషెంట్ల బ్లడ్ శాంపిల్స్ కాదు. కోతి ఎత్తుకెళ్లిన శాంపిల్స్ సాధారణ పరీక్షల కోసం తీసుకున్నవి. కరోనావైరస్ నమూనాలను ఓపెన్‌గా కాకుండా.. ఒక బాక్సులో పెట్టి తీసుకెళ్తారు. కాబట్టి ఆస్పత్రి చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు” అన్నారు.అంతేకాదు కరోనావైరస్ మనుషుల నుంచి కోతులకు వ్యాపించగలదని ఇప్పటివరకు నిరూపితం కాలేదు. కోతులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ జంతువులలో మాత్రమే కరోనావైరస్ లక్షణాలు బయటపడ్డాయి. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న జంతువులకు మాత్రమే కరోనా సోకిందని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.


End of Article

You may also like