Ads
ఈ వీడియో లోని వృద్ధ మహిళ ప్రతి రోజు ఉదయం సమయంలో కోతులకి రొట్టెలు తినిపిస్తూ ఉండేది. అయితే.. ఓ రెండు రోజులుగా.. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో ఆమె రొట్టెలు పెట్టలేకపోయింది. అయితే.. ఈ వృద్ధ మహిళ కనిపించకపోయేసరికి ఆ కోతులలో ఒక కోతి ఏకంగా ఇంటికి వచ్చేసింది.
Video Advertisement
జంతువులకు కూడా ప్రేమ పాళ్ళు ఎక్కువే ఉంటుంది అని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. జంతువులు కూడా ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకే వాటికి మనుషులతో అనుబంధం కలుగుతుంది.
సాధారణంగా పెంపుడు జంతువులు అనగా కుక్కలు, పిల్లులు గుర్తుకు వచ్చినా మిగతా జంతువులకు కూడా ప్రేమ ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియోనే ఉదాహరణ. ఈ కోతి ఆ ముసలవ్వ ఇంటికి వచ్చి చేసిన అల్లరి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి. ఈ కోతి చేస్తున్న చేష్టలు చూస్తే ఎంతటి వారికైనా ఆశ్చర్యం కలగక మానదు.
ఆ వృద్ధ మహిళ రెండు రోజుల పాటు కనిపించకపోయేసరికి ఈ కోతి సరాసరి ఇంటికి వచ్చేసింది. మంచం పై ఆమె పడుకుని ఉండడం చూసి ఆమె పరిస్థితిని అర్ధం చేసుకుంది. తాను కూడా మంచం ఎక్కేసి ఆ అవ్వ పక్కనే కూర్చుంది. ఆమెను ఆప్యాయంగా చూడడమే కాదు.. ఆమె త్వరగా కోలుకోవాలని హత్తుకుంది కూడా. తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో ను మీరు కూడా చూసేయండి. మనం కొంచం ప్రేమ చూపించినా చాలు.. జంతువులు మన మీద అపారమైన ప్రేమని, నమ్మకాన్ని కురిపిస్తాయి అనడానికి ఈ వీడియోనే ఉదాహరణ. ఆ కోతి అవ్వపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే కళ్ళు చెమరుస్తున్నాయ్ కదా.
End of Article