Ads
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో. రణబీర్ కపూర్, రష్మీక కాంబోలో ఈరోజు విడుదలైన చిత్రం యానిమల్. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సింహగర్జన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. స్ట్రైట్ తెలుగు మూవీ తో సమానంగా ఈ మూవీ ఆదరణ అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మూవీ నిడివి ఏకంగా 3 గంటల 21 నిమిషాలు కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Video Advertisement
అంతసేపు ఉన్న సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆసక్తిగా సాగడం తో క్రెడిట్ అంతా డైరెక్టర్ కే ఇస్తున్నారు నెటిజన్స్. ఇంతకుముందు కూడా టాలీవుడ్ లో మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఎన్నో క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ మూవీ కంటే ఎక్కువ లెంతీగా ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏమిటో ఒక లుక్ వేద్దాం పదండి..
#1. దాన వీర శూర కర్ణ.. 1997లో విడుదలైన ఈ చిత్రం నిడివి 3 గంటల 53 నిమిషాలు.
#2. ఎల్‌వోసీ కార్గిల్.. 2003లో విడుదలైన ఈ కార్గిల్ వార్ బేస్డ్ చిత్రం నిడివి 4 గంటల 15 నిమిషాలు.
#3. మేరా నామ్ జోకర్..1970లో వచ్చిన ఈ మూవీ నిడివి 3 గంటల 44 నిమిషాలు.
#4. లగాన్.. వన్స్ అపాన్ ఎ టైమ్- స్వాతంత్రానికి ముందు జరిగిన సన్నివేశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నిడివి 3 గంటల 44 నిమిషాలు.
#5. నాడోడీ మన్నన్ – 1958 లో వచ్చిన ఈ తమిళ్ మూవీ నిడివి 3 గంటల 40 నిమిషాలు.
#6. ఆదిపురుష్ – ప్రభాస్ రాముడు గా నటించిన ఈ చిత్రం నిడివి ఒక్క నిమిషం తక్కువ 3 గంటలు..అంటే 2.59 గంటలు అన్నమాట.
#7. ఆర్ఆర్ఆర్ – టాలీవుడ్ కీర్తి దేశ దేశాలకు చాటి చెప్పిన ఆర్ఆర్ఆర్ మూవీ నిడివి 3.02 గంటలు.
#8. పుష్ప.. ద రైస్ – అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకానిక్ స్టార్ గా చేసిన పుష్ప మూవీ నిడివి 2.59 గంటలు.
#9. అర్జున్ రెడ్డి.. – విజయ్ దేవరకొండను హీరో గా నిలబెట్టిన మూవీ అర్జున్ రెడ్డి..నిడివి కూడా 3.02 గంటలు.
#10. ప్రస్థానం – 2010లో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా..నిడివి 3.01 గంటలు.
End of Article