Ads
సాధారణంగా ఒక సినిమా గురించి ప్రేక్షకులని ఎక్సైట్ చేసే అంశాలు హీరో డైరెక్టర్ కాంబినేషన్, హీరో హీరోయిన్ కాంబినేషన్, లేదా హీరో మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్, లేదా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్. ఇంక హీరో, మరొక హీరో కాంబినేషన్ అంటే ఆ ఎక్సయిట్మెంట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలా రాబోయే కొన్ని మల్టీస్టారర్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 అయ్యప్పనుం కోషియుం రీమేక్
ఇందులో మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించబోతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకి దర్శకత్వం వహించిన సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు.
#2 పొన్నియన్ సెల్వన్
మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విక్రమ్, జయం రవి, కార్తీ కలిసి నటించబోతున్నారు. ఇది పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది.
#3 ఆర్ ఆర్ ఆర్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
#4 ఎఫ్3
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 2 తో అలరించారు. ఇప్పుడు ఎఫ్ 2 సీక్వెల్, ఎఫ్ 3 తో మన ముందుకు రాబోతున్నారు.
#5 ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో అతిథి పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఫుల్ లెంత్ రోల్ లో కనిపిస్తారని కొరటాల శివ ఒక సందర్భంలో చెప్పారు.
#6 మాస్టర్
విజయ్, విజయ్ సేతుపతి కలిసి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన మాస్టర్ తమిళ్, తెలుగు టీజర్స్ ఇప్పటికే ఎక్కువ వ్యూస్, లైక్స్ తో రికార్డ్ సృష్టించాయి.
#7 మహా సముద్రం
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించబోతున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు.
#8 భారతీయుడు 2
1996 లో విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన భారతీయుడు సినిమా సీక్వెల్ లో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, బాబీ సింహ కూడా నటించబోతున్నారు.
ఇవే కాకుండా ఇంకా అధికారికంగా ప్రకటించని చాలా మల్టీస్టారర్ సినిమాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
End of Article