పెళ్లి అన‌గానే ఎంత హడావుడి, బంధు మిత్రులు సందడి, పెద్ద ఎత్తున భోజ‌నాలు, పట్టుచీరలు, ఆభరణాల ధగధగలు.. అబ్బో ల‌క్షల్లో ఖ‌ర్చు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే కాబట్టి చాలామంది తమ పెళ్లి వేడుక ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. మధ్యతరగతి వారే ఇలా అనుకుంటే.. మైనింగ్ కింగ్ గా పేరు సంపాదించిన గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి అంగరంగవైభవం గా జరిపించారు.

Video Advertisement

 

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కూతురు బ్రహ్మణి వివాహం నవంబర్ 6, 2016లో జరిగింది. ఈ వివాహానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మాజీ మంత్రి. 50 వేల మందికిపైగా అతిథులు ఈ పెళ్లికి హాజరయ్యారు. 5 రోజుల రోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరిగాయి. ఇన్విటేషన్ కార్డు నుంచి భారీ సెట్టింగ్స్ వరకు దేశవ్యాప్తంగా ఈ పెళ్లి వైరల్ అయ్యింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం తో ఈ పెళ్లి విషయం మరోసారి వైరల్ హైలైట్ అయ్యింది.

gali janardhan reddy daughter's lavish wedding recalled by netizens..

గాలి బ్రాహ్మణి వివాహ ఆహ్వాన పత్రిక గా డిజిటల్ ఇన్విటేషన్ కార్డుని అతిథులకు పంపారు. ఈ పెళ్లి కార్డులపై ఎల్‌సీడీ స్క్రీన్స్ ప్లే చేశారు. ఈ స్క్రీన్ ఒక బాక్స్‌లో ఉంటుంది. అందులో రెడ్డీ కుటుంబ సభ్యులు బంధువులు, అతిథులను ఆహ్వానిస్తున్న వీడియో ఉంది. పెళ్లికి వచ్చిన అతిథులను 40 లగ్జరీ బుల్లోక్ కార్ట్స్‌‌లోకి ఎక్కించి గేటు నుంచి పెళ్లి మండపానికి తీసుకెళ్లారు.

gali janardhan reddy daughter's lavish wedding recalled by netizens..

రూ.150 కోట్లతో విజయ నగర ఆలయం మాదిరిగా పెళ్లి మండపాన్ని పలువురు బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్లు రూపొదించారు. డైనింగ్ ఏరియాను బెల్లారి గ్రామం మాదిరిగా డిజైన్ చేశారు. అతిథులను పెళ్లి మండపానికి తీసుకొచ్చేందుకు 2000 కార్లు, 15 హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. వారు ఉండడటానికి బెంగళూరులో ఫైవ్ స్టార్, త్రీ స్టార్ హోటళ్లలో 1500 రూమ్స్ బుక్ చేశారు.

gali janardhan reddy daughter's lavish wedding recalled by netizens..
అలాగే అతిథులకు టువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా వుండటం కోసం 1 లక్ష మంది గ్రౌండ్ స్టాఫ్, 2500 మంది సూపర్‌వైజర్లు, 1000 మంది మేనేజర్లని నియమించారు. ఈ పెళ్ళిలో గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి రూ.17 కోట్లు విలువైన కంజివరమ్ శారీ కట్టుకున్నారు. ఈ చీరలో స్వచ్ఛమైన బంగారం దారాలను వినియోగించారు.

gali janardhan reddy daughter's lavish wedding recalled by netizens..

పెళ్లి లో ఆమె ధరించిన వజ్రాభరణాల విలువ రూ.90 కోట్లు ఉంటుందని అంచనా. పెళ్లి కుమార్తె మేకప్ కోసం ముంబై నుంచి 50 మంది టాప్ మేకప్ ఆర్టిస్టులను రప్పించారు. దీని కోసం ఏకంగా రూ.30 లక్షలు ఖర్చు చేశారు. వెయ్యి వంటకాలతో మెనూ తయారు చేసారు. దీని కోసమే 100 కోట్లు ఖర్చు అయ్యాయట. మొత్తంగా ఈ వివాహానికి 500 కోట్లు ఖర్చు చేసారని తెలుస్తోంది.