సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ని రూల్ చేస్తున్న హీరోలలో ఆయన నెంబర్ 1 లో ఉంటారు. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మహేష్ బాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు…ఆ తరువాత సినిమాలు దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

Video Advertisement

సినిమాల నుంచి భారీగా డబ్బు సంపాదిస్తున్న మహేష్ బాబు మరోవైపు అడ్వర్టైజింగ్, బిజినెస్ వెంచర్స్ తో ఫైనాన్షియల్ గా చాలా ఎదిగిపోయారు. మహేష్ కు సంబంధించిన ఫైనాంటిల్ వ్యవహారాలన్నింటిని ఆయన భార్య నమ్రత చూసుకుంటారన్న విషయం మనకు తెల్సిందే.

maheshbabu luxurious life
కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నమ్రత పెళ్లి తర్వాత మహేష్, ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నారు.
ఇప్పుడు మహేష్ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వాటి వివరాలు తెల్సుకుందాం.

1 . 28+ కోట్ల విలువైన బంగ్లా

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మహేష్ బాబుకి ఒక బంగ్లా ఉంది, అక్కడ తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి నివసిస్తున్నాడు. ఇందులో ఒక స్విమ్మింగ్ పూల్, ఓపెన్ రూఫ్‌టాప్ పార్టీ ఏరియా వంటి సౌకర్యాలు ఉన్నాయి.

maheshbabu luxurious life
2 . 6 .2 కోట్ల వానిటీ వాన్

షూటింగ్ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి మహేష్ బాబు ఒక పర్సనల్ వానిటీ వ్యాన్‌ను కొనుగోలు చేశాడు. ఆకర్షణీయమైన ఇంటీరియర్స్, బెడ్‌రూమ్, వాష్‌రూమ్ మరియు చిన్న లివింగ్ రూమ్‌తో వానిటీ వాన్ చిన్న సైజు విల్లా లా ఉంటుంది.

maheshbabu luxurious life
౩. ఏఎంబి సినిమాస్- 80 కోట్లు

ఆసియన్ సినిమాతో కలిసి మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ అంటే ఏషియన్ & మహేష్ బాబు సినిమాస్‌తో మూవీ ఎగ్జిబిషన్ వ్యాపారాన్ని ప్రారంభించాడు.

maheshbabu luxurious life
4 . రేంజ్ రోవర్ వోగ్- 4 కోట్లు

2010 లో మహేష్ పుట్టినరోజున అతనికి రేంజ్ రోవర్ వోగ్‌ని నమ్రత బహుమతిగా ఇచ్చింది.

maheshbabu luxurious life
5 . రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ 4 కోట్ల పైనే

మహేష్ బాబు 2020లో అద్భుతమైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారును కొనుగోలు చేశారు ఆ టాప్ మోడల్ ధర రూ. 4+ కోట్లు

6 . లంబోర్ఘిని గల్లార్డో- 2 .80 కోట్లు

మహేష్ బాబు ఇంట్లో 2 రేంజ్ రోవర్లతో పాటు 2-సీటర్ స్పోర్ట్స్ కారు లాంబోర్గినీ గల్లార్డో ఉంది.

maheshbabu luxurious life

7 . ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు – 1.19 కోట్లు

తాజాగా మహేష్ ఈ కారును కొనుగోలు చేశారు

maheshbabu luxurious life

 

8 . మర్సిడీజ్ బెంజ్

ఈ కారు 5 వేరియంట్‌లలో వస్తుంది, దీని ధర రూ. 66.99 లక్షల నుండి మొదలై రూ. 84.99 లక్షల వరకు ఉంటుంది.
వీటితో పాటు 50 లక్షల విలువైన పియాజెట్ పోలో వాచ్, 45 లక్షల విలువైన బ్రెగ్యుట్ మెరైన్ క్రోనోగ్రాఫ్ వాచ్ కూడా మహేష్ దగ్గర ఉన్నాయి.