2020 లో బాగా హిట్ అయిన టాప్ 20 సాంగ్స్ ఇవే…ఏ పాటకు ఎన్ని వ్యూస్ వచ్చాయంటే.?

2020 లో బాగా హిట్ అయిన టాప్ 20 సాంగ్స్ ఇవే…ఏ పాటకు ఎన్ని వ్యూస్ వచ్చాయంటే.?

by Anudeep

Ads

సినిమా లతో పాటు ప్రేక్షకులు ఎక్కువ గా ఇష్టపడేవి పాటలు. యూట్యూబ్ వచ్చాక.. ఈ ఇష్టాన్ని మరింత ఎక్కువ గా ప్రకటించుకోవడానికి అవకాశం దొరికింది. తమకు నచ్చిన పాటలకు లక్షల కొద్దీ వ్యూస్ తో రికార్డు లు కట్టబెడుతున్నారు. అలా కొన్ని నచ్చిన సాంగ్స్ ఎక్కువ వ్యూస్ వచ్చిన సాంగ్స్ లిస్ట్ ను ఇక్కడ ఇస్తున్నాం.

Video Advertisement

1. అల వైకుంఠపురములో… బుట్ట బొమ్మా సాంగ్

బుట్టబొమ్మ సాంగ్ కి ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ కూడా ఈ పాట స్టెప్పులేసి మీమర్స్ కి బోలెడు పని చెప్పేసాడు. ఈ పాట ఇప్పటికే 489,764,378 వ్యూస్ ను సొంతం చేసుకుంది.

2. అల వైకుంఠపురములో…రాములో రాములో సాంగ్

బన్నీ, పూజ హెగ్డే జంట గా నటించిన “అలా వైకుంఠ పురం లో ” సినిమా లో సాంగ్ ఇది కూడా.. సినిమా రిలీజ్ కి ముందు నుంచే ఈ పాట కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ పాట 273,795,104 వ్యూస్ ను సాధించి ఎనలేని రికార్డు ను సొంతం చేసుకుంది.

3. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా – నీలి నీలి ఆకాశం సాంగ్..

ప్రదీప్ హీరో గా పరిచయం కాబోతున్న ” 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ” సినిమా లో ఈ సాంగ్ కూడా ప్రేమికుల్ని కట్టిపడేస్తుంది. ఈ సాంగ్ 214,310,773 వ్యూస్ ను సాధించి ప్రదీప్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

4. ఉప్పెన – నీ కళ్ళు నీలి సముద్రం సాంగ్..

మెగా హీరో, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్, కొత్త హీరోయిన్ కృతి శెట్టి జంట గా నటించిన సినిమా ఉప్పెన. ఈ సినిమా లోని ఈ పాట కూడా అమితం గా ఆకట్టుకుంది. అసలు కృతి శెట్టి లుక్స్ కోసమే ఈ పాటను చూసే వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఈ పాటలోని సాహిత్యం మరొక ఎత్తు.

5. అల వైకుంఠపురములో – సామజవరాగమనా సాంగ్

అలా వైకుంఠపురం లో ని అన్ని పాటలు దాదాపు గా ఆకట్టుకున్నాయి. రాములో రాముల, బుట్ట బొమ్మ సాంగ్స్ తో పాటు, ఈ పాట కూడా ఎనలేని క్రేజ్ సంపాదించేసుకుంది.

6. భీష్మ – వాట్టే వాట్టే బ్యూటీ సాంగ్

నితిన్, రష్మిక జంట గా నటించిన సినిమా “భీష్మ”.. సాలిడ్ హిట్ గా నిలిచి నితిన్ కు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా లో వాట్టే వాట్టే బ్యూటీ పాట సూపర్ హిట్ గా నిలిచింది. యు ట్యూబ్ లో 62,960,036 వ్యూస్ ను సాధించింది.

7. పలాస 1978 – నక్కిలీసు గొలుసు సాంగ్..

రక్షిత్, నక్షత్ర కీలక పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా నుంచి నక్కిలీసు గొలుసు పాటకు ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది. యు ట్యూబ్ లో ఈ పాట 66,493,834 వ్యూస్ ను సంపాదించుకుంది.

8. జాను – ది లైఫ్ అఫ్ రామ్ సాంగ్..

తమిళ నాట హిట్ అయిన 96 సినిమా కు తెలుగు రీమేక్ జాను. ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు విపరీతం గా నచ్చేసింది. ఈ సినిమా లో ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతాం. అలంటి ఎమోషనల్ సాంగ్ అయిన ఈ సాంగ్ కి కూడా అలాగే కనెక్ట్ అయిపోతాం. యు ట్యూబ్ లో ఈ పాట 64,703,688 వ్యూస్ ను సొంతం చేసుకుంది.

9. సవారి – ఉండిపోవా సాంగ్..!

శనందు, ప్రియాంక కీలక పాత్ర పోషించిన సినిమా సవారి. నందు ఈ సినిమా లో హీరో గా నటించాడు. ఈ సినిమా లో ఉండిపోవా అనే సాంగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ పాట యు ట్యూబ్ లో 54,244,749 వ్యూస్ ను సాధించింది.

10. పొగరు – ఖరాబు సాంగ్.

కరాబు.. మైండ్ కరాబు పాట రెండు తెలుగు రాష్ట్రాలలోను సంచలనం సృష్టించింది. కన్నడ లో కూడా ఈ పాట మిలియన్స్ వ్యూస్ ను సాధించింది. ఈ పాటా తెలుగు వర్సిన్ కు కూడా యు ట్యూబ్ లో మంచి పేరు వచ్చింది. తెలుగు పాట యు ట్యూబ్ లో 49,844,502 వ్యూస్ ను సాధించింది.

11. రాహు – ఏమో ఏమో సాంగ్

ఈ సినిమా చిన్న సినిమా అయిన, ఈ పాట మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. యు ట్యూబ్ లో 43,174,583 వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ పాట.

12. వకీల్ సాబ్ – మగువ మగువా సాంగ్

సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ స్టార్ సినిమా వకీల్ సాబ్ నుంచి వచ్చిన మగువా మగువా పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాట యు ట్యూబ్ లో 39,245,624 వ్యూస్ ను సొంతం చేసుకుంది.

13. అల వైకుంఠపురములో – ఓ మై గాడ్ డాడీ

అలవైకుంట పురం లో సినిమా పాటలన్ని దాదాపు గా ఆకట్టుకున్నాయి. ఓ మై గాడ్ డాడీ పాట కూడా యు ట్యూబ్ లో 37,975,043 వ్యూస్ ను సొంతం చేసుకుంది.

14. సోలో బ్రతుకే సో బెటర్ – హే ఇది నేనేనా..

సాయి ధరమ్ తేజ్, నభ నటేష్ జంట గా నటించిన సినిమా సోలో బతుకే సో బెటర్.. ఈ సినిమా హే ఇది నేనేనా సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. తక్కువ టైం లో నే ఈ పాట 28,804,261 వ్యూస్ ను సొంతం చేసుకుంది.

15. ఉప్పెన – ధక్ ధక్ ధక్ సాంగ్

కృతి శెట్టి, వైష్ణవ తేజ్ జంట గా నటించిన ఉప్పెన సినిమా లో పాటలు ఆకట్టుకుంటాయి. నీ కళ్ళు నీలి సముద్రం పాట తరువాత, ధక్ ధక్ ధక్ సాంగ్ కూడా బాగా నచ్చుతుంది. ఈ పాట కు యు ట్యూబ్ లో 25,426,873 వ్యూస్ వచ్చాయి.

16. వి – వస్తున్నా వచ్చేస్తున్నా

నాని, సుధీర్ బాబు కీలక పాత్రలను పోషించిన సినిమా వి.. ఈ సినిమా లో వస్తున్న, వచ్చేస్తున్నా పాట కు 2,754,275 వ్యూస్ వచ్చాయి..

17. సవారి – నీ కన్నులు సాంగ్

నందు హీరో గా నటించిన సవారీ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా లో నీ కన్నులు పాట యు ట్యూబ్ లో 19,885,076 వ్యూస్ ను తెచ్చుకుంది.

18. వి – మనసు మరీ సాంగ్..

వి సినిమా లో అదితి రావుకు నాని కి మధ్య వచ్చే మనసు మరీ సాంగ్ ఎంతో లవ్లీ గా ఉంటుంది. ఈ పాటకు యు ట్యూబ్ లో 18,174,581 వ్యూస్ దక్కాయి..

19. శ్రీకారం – భలేగుంది బాలా

శర్వానంద్ హీరో గా నటించిన శ్రీకారం సినిమాలో భలేగుంది బాల పాట కూడా మంచి ఆడియన్స్ నే సంపాదించుకుంది. ఈ పాటకు యూట్యూబ్ లో పద్దెనిమిది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి..

20. భీష్మ – సింగిల్స్ సాంగ్

నితిన్‌, రష్మిక జంటగా నటించిన భీష్మ చిత్రం నుంచి సింగిల్స్ anthem పేరు తో రిలీజ్ ఐన ఈ పాట కూడా మంచి వ్యూస్ ను సంపాదించింది. యు ట్యూబ్ లో ఈ పాటకు 7,986,878 వ్యూస్ వచ్చాయి..

అదండీ సంగతి.. ఈ లిస్ట్ లో మీకు నచ్చిన సాంగ్స్ కూడా ఉంటె.. మీరు కూడా ఓ లుక్ వేసేయండి. ఇంకేమైనా మీకు నచ్చిన సాంగ్స్ ఉంటె..కామెంట్ చేయండి.


End of Article

You may also like