24 ఏళ్ల కొడుక్కి..42 ఏళ్ల తల్లికి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం..! రియల్ స్టోరీ.!!

24 ఏళ్ల కొడుక్కి..42 ఏళ్ల తల్లికి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం..! రియల్ స్టోరీ.!!

by Anudeep

Ads


కేరళలో జరిగిన ఒక అరుదైన సంఘటన అందరికి ప్రేరణ గా నిలిచింది. ఓ తల్లి తన కుమారుడితో పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కు హాజరు అవ్వడమే కాకుండా ఏకంగా ఆ ఎగ్జాం లో ఉత్తీర్ణత సాధించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. చదువుకి సక్సెస్ కి సాధించాలి అన్న తపన ముఖ్యమంత్రి వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమే అని నిరూపించింది.

Video Advertisement

కేరళలో, మలప్పురానికి చెందిన బిందు ( 42 సంవత్సరాలు) మరియు ఆమె కొడుకు వివేక్ (24 సంవత్సరాలు) ,ఇద్దరు కలిసి ఒకేసారి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను రాశారు. తన చిన్నతనం నుండి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అన్న బిందు కల ఇన్నేళ్ల తర్వాత కొడుకుతో పాటు నిజమైంది.

image credits: ANI

గత 11 సంవత్సరాలుగా బిందు ఆరీకోడ్‌లో అంగన్‌వాడీ టీచర్‌ గా పని చేస్తున్నారు. ఆమె 2019-20లో ఉత్తమ అంగన్‌వాడీ టీచర్‌గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నారు. ఆమె ఇప్పటి వరకు రెండు సార్లు పీఎస్సీ పరీక్షలు రాశారు అంతే కాదు సి డి సి సూపరింటెండెంట్ పరీక్ష కూడా రయబోతున్నారు. ఈమె భర్త మలప్పురం ఆర్టీసీలో డిపో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు వివేక్ మరియు హృద్య.

ఇది ఇలా ఉండగా ఒకేసారి తల్లీ కొడుకులకి గవర్నమెంట్ జాబ్ ఎలా వచ్చింది అన్న డౌట్ అందరికీ కలుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు ఏ ఇచ్చినటువంటి అని అందరికీ తెలుసు కాబట్టి. కేరళలోని స్ట్రీమ్-2 పోస్టులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు మాత్రమే కానీ మళ్లీ ఇందులో కొన్ని వర్గాలకు చెందిన వారికి కొన్ని సడలింపులు ఉన్నాయి. .ఓబీసీ కేటగిరీ కి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ మరియు వితంతువుల కేటగిరీ కి ఐదేళ్లు సడలింపు ఇచ్చారు . కాగా వికలాంగులకు సడలింపు 15 సంవత్సరాలు ఇవ్వగా వికలాంగుల లో ఆర్థోపెడికల్‌గా ఉన్న వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఇచ్చారు.

పోటీ పరీక్షలకు ఇద్దరూ కలిసి కోచింగ్ తీసుకోవడం తో పాటు కంబైన్డ్ స్టడీ చేసే వారు. కుటుంబ సభ్యులు మరియు కోచింగ్ సెంటర్ లోని అధ్యాపకులు ఈ తల్లీ కొడుకుల పట్టుదల ను చూసి ఎంతో సంతోషించి తమవంతు ప్రోత్సాహం అందించారు. అందరి సపోర్ట్ తో అసామాన్య దీక్ష తో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో బిందు ఎల్జిఎస్ జాబితాలో 92వ ర్యాంక్ సాధించగా. ఇక ఆమె కుమారుడు వివేక్ ఎల్డీసీ జాబితాలో 38వ ర్యాంకు సాధించారు. తమ కష్టం వృధా కాకుండా ఇద్దరికీ ఒకేసారి ఉద్యోగం రావటం పై ఆ తల్లీ కొడుకుల హర్షం వ్యక్తం చేశారు.


End of Article

You may also like