Ads
నాగరికత పెరుగుతున్నా మూఢనమ్మకాలు మాత్రం జనాలను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. తనకేదో దోషం ఉందని నమ్మిన ఓ తల్లి కన్న బిడ్డనే చంపేసిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామం వద్ద చోటు చేసుకుంది. బుర్కచర్ల గ్రామం మేకలపాటి తండా కు చెందిన ఓ మహిళ ఆరు నెలల పసిబిడ్డను దారుణం గా గొంతు కోసి చంపేసింది. తన భార్య మూఢ నమ్మకాల వల్లే పసిపిల్ల ప్రాణం పోయిందంటూ రోదిస్తున్న ఆ తండ్రిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.
Video Advertisement
సాక్షి కధనం ప్రకారం, మేకలపాటి తండాకు చెందిన కృష్ణ అనే వ్యక్తి కి భారతి అలియాస్ లాస్య( బుజ్జి) అనే అమ్మాయి తో మూడేళ్ళ క్రితం వివాహం జరిగింది. భారతి తల్లి తండ్రులు కూడా అదే తండా లో నివాసం ఉండేవారు. కృష్ణ వికలాంగుడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. భారతి కూడా డిగ్రీ తో పాటు బీఈడీ చేసింది. చదువుకున్న అమ్మాయే అయిన మూఢనమ్మకాలు పెంచుకుంది.
భారతి, కృష్ణ ల వివాహం అయినా ఏడెనిమిది నెలల తరువాత ఓ సాధువు వాళ్ళింటికి వచ్చాడు. ఆయన్ని చూసిన భారతి తనకు ఎప్పుడు చూసిన భయం భయం గా ఉంటోంది అని.. ఇది పోవాలంటే ఏమి చేయాలనీ, ఆమె ఆ సాధువు ని అడిగింది. అయితే, అందుకు ఆ సాధువు ఆమెకు నాగ సర్ప దోషం ఉందంటూ నమ్మబలికాడు. ఆ దోషం పోవాలంటే నాగపూజలు చేయాలనీ.. ఆమెకు పుట్టిన బాబునో/పాపనో బలి ఇవ్వాలని సూచించాడట.
ఆమె అప్పటినుంచి వారం లో రెండు మూడు రోజుల పాటు నాగపూజలు చేసేది. కాగా, ఆరునెలల క్రితమే ఆమె పండంటి ఆడబిడ్డకు (రీతూ) జన్మనిచ్చింది. పాప పుట్టిన తరువాత కూడా ఆమె పూజలు మానలేదు. ఆమె గతం లో కూడా రెండు మూడు సార్లు చిన్నారిని చంపడానికి ప్రయత్నించిందని ఆమె బంధువులు చెప్పడం గమనార్హం. భర్త కృష్ణ కూడా ఈ విషయాన్నీ గమనించి ఆమె తల్లితండ్రులకు తెలిపాడు. కుమార్తె మానసిక పరిస్థితి ఏమి బాగోలేదని, రీతూ ను తీసుకెళ్లాలని చెప్పాడు. కానీ, వారు పట్టించుకోలేదు.
గురువారం మధ్యాహ్న సమయం లో కృష్ణ సూర్యాపేట కు వెళ్లాల్సిన పని ఉండడం తో.. అత్తమామలకు విషయం చెప్పి బయలుదేరాడు. వారు పట్టించుకోలేదు. కృష్ణ లేని సమయం లో అదను చూసి.. భారతి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. హత్య చేయడానికి ముందు ఆమె నాగపూజలు చేసినట్లు తెలుస్తోంది. పూజలు చేసి, బిడ్డను పట్టుకుని గొంతు పై కోసి బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత “నా బిడ్డ రీతుని చంపేశా.. నాగసర్ప దోషమే కాదు ఏ దోషము నాకింక అడ్డు రాదు..” అనుకుంటూ తల్లితండ్రుల ఇంటికి పరుగుతీసింది.
తల్లితండ్రుల వద్దకు వెళ్ళిన భారతి… తనకు పుట్టిన పాప వలనే తనకు ప్రాణగండం ఉందని.. ఇకపై తనకు ఏ గండం ఉండదని ఏడుస్తూ చెప్పింది. ఆమె తల్లి తండ్రులు హతాశులై ఇంటికి వెళ్లి చూడగా.. అప్పటికే రీతూ మరణించింది. సూర్యాపేట నుంచి ఇంటికి వచ్చిన కృష్ణ మృతి చెందిన తన కూతురు ను చూసి గుండెలవిసేలా రోదించాడు. తన భార్య వలనే కూతురు చనిపోయిందని అతను ఏడుస్తుంటే స్థానికుల హృదయాలు బరువెక్కాయి. ఈ ఘటన స్థానికం గా విషాదం నింపింది.
End of Article