Ads
“నేను బతుకుతానో లేదో..ఒక్కసారి ..ఒకే ఒక్కసారి నా పాపను చూడనివ్వండి” అంటూ ఆ తల్లి పడిన ఆవేధన తన పక్కన ఉన్న హాస్పిటల్ స్టాఫ్ నే కాదు, సోషల్ మీడియాలో వైరలవుతూ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది..ఆ తల్లి బాధ తీర్చడానికి హాస్పిటల్ స్టాఫ్ ఏం చేయలేకపోయారు. చివరికి వీడియో కాల్ ద్వారా తన బిడ్డను చూపించి కొంతలో కొంత ఆ తల్లికి ఊరట కలిగించారు.
Video Advertisement
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సివిల్ హాస్పిటల్లో డెలివరి కోసం జాయిన్ అయిన ఒక మహిళకి టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో తనని ఐసోలేషన్లో ఉంచి ఏప్రిల్ 18న సిజేరియన్ చేసి డెలివరి చేసారు డాక్టర్లు.. పుట్టిన బిడ్డకు కరోనా నెగటివ్ రావడంతో బిడ్డను తల్లి నుండి దూరంగా ఉంచారు. స్పృహలోకి వచ్చిన మహిళ బిడ్డను ఒక్కసారి చూడాలని ప్రాదేయపడింది. కాని చంటిబిడ్డలు త్వరగా కరోనాకి ఎపెక్ట్ అవుతుండడంతో డాక్టర్లు ఆ తల్లి కోరిక తీర్చలేకపోయారు.
చివరికి ఆ తల్లి బాధ చూడలేక వీడియో కాల్ ద్వారా బిడ్డను చూపించారు.. వీడియో కాల్లో బిడ్డను చూడగానే ఆ తల్లి భావోద్వేగానికి గురైతే.. ఆ చంటిబిడ్డ కళ్లు విప్పార్చి తల్లినే చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతూ అందరి చేత కంట తడి పెట్టిస్తోంది.. తన బిడ్డ ప్రాణాలు రక్షించుకోవాలంటే తను దూరంగా ఉండక తప్పదనే చేదు నిజాన్ని ఆ తల్లి అంగీకరించి, నవమాసాలు మోసి , పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కన్న ఆ తల్లి వీడియో కాల్ ద్వారా మాత్రమే ఆ బిడ్డను చూసుకుని కొంత సంతోషపడింది.
ఇదిలా ఉండగా ప్రెగ్నెంట్ లేడికి కరోనా ఎలా సోకిందా అనే అనుమానాలు వ్యక్తం అవతుండగా స్వీడన్ కు చెందిన రీసెర్చర్స్ చెప్పిన సమాధానం బట్టి, మిగతా వాళ్లు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తోంది.ఇంతకీ వారు చెప్పింది ఏంటంటే “ప్రెగెన్సీ సమయంలో స్త్రీలకు వ్యాధినోరోధక శక్తి చాల వరకు తగ్గిపోతుంది.ఆ సందర్భములో కరోనా సోకి ఉండొచ్చు. కానీ జన్యుపరంగా కడుపులోని బిడ్డకు పుట్టుకతో తల్లి నుండి ఏ వ్యాధి సోకదు” అని వారు తెలిపారు.
End of Article