Ads
ప్రతీ ఇండస్ట్రీలోనూ వేరు వేరు రకాల సినిమాలు వస్తుంటాయి. కొన్ని కమర్షియల్ అయితే, కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఎక్స్పెరిమెంటల్ గా ఉంటాయి. కొన్ని సినిమాల్లో అయితే కథ మొత్తం ఒక పాత్ర చుట్టూ తిరుగుతుంది. అలా మన ఇండస్ట్రీలో మదర్ సెంటిమెంట్ సినిమాలు ఎన్నో వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఆ సినిమాలు కొన్ని ఇవే.
Video Advertisement
#1 అమ్మ రాజీనామా
ఈ సినిమాలో ఎవరు రాయగలరు అనే పాట ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుంది. ఇంక మెయిన్ లీడ్ గా ఊర్వశి శారద గారి పెర్ఫార్మన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.
#2 రఘువరన్ బీటెక్
అసలు మదర్ సెంటిమెంట్ సినిమాలు అనంగానే మీలో చాలా మందికి సినిమా స్ట్రైక్ అయ్యే ఉంటుంది. సినిమా వచ్చి దాదాపు ఆరు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ క్రేజ్ అలానే ఉంది.
#3 మాతృదేవోభవ
ఈ సినిమాలో రాలిపోయే పువ్వా పాటని ఇప్పుడు మనం చాలా చోట్ల విన్నాము కాబట్టి మామూలుగానే అనిపిస్తుంది. కానీ అంతకుముందు ఈ పాట విని ఎమోషనల్ గా ఫీల్ అయ్యే వారు చాలా మంది ఉంటారు. సినిమా కూడా అంతే ఎమోషనల్ గా ఉంటుంది.
#4 లోఫర్
ఇందులో రేవతి గారి పాత్ర, డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.
#5 సింహరాశి
ఈ సినిమా కూడా అందులోనూ ముఖ్యంగా తల్లి కొడుకుల ఎపిసోడ్ అయితే ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది.
#6 కేజిఎఫ్
కేజిఎఫ్ సినిమా తర్వాత ఎలా కంటిన్యూ అయినా కూడా అసలు రాకీ అనే ఒక క్యారెక్టర్ రావడానికి కారణం వాళ్ళ అమ్మ చెప్పిన మాటలే. తర్వాత కూడా రాకీ కి తన తల్లి చెప్పిన మాటలతోనే స్టోరీ క్యారీ అవుతూ ఉంటుంది. ఈ సినిమాలో “ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు” అనే ఒక డైలాగ్ మనం చాలా చోట్ల వినే ఉంటాం. చూసే ఉంటాం.
#7 ఛత్రపతి
కమర్షియల్ సినిమా అయినా కూడా మెయిన్ కాన్సెప్ట్ మాత్రం మదర్ సెంటిమెంట్ చుట్టూ నడుస్తుంది.
#8 అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
ఈ సినిమాలో జయసుధ గారికి, రవితేజ కి మధ్య వచ్చే సీన్స్ చాలా నాచురల్ గా తీసారు పూరి జగన్నాథ్.
#9 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ఈ సినిమా కూడా తర్వాత వేరే ట్రాక్ లోకి వెళ్ళినా, అసలు మొదలయ్యేది మాత్రం అమ్మ అనే పాయింట్ తోనే.
#10 యమలీల
ఈ సినిమాలో అలీకి, మంజు భార్గవి గారికి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి.
#11 బిచ్చగాడు
డబ్బింగ్ సినిమా అయినా కూడా మన తెలుగు సినిమా అంత హిట్ అయ్యింది.
#12 నాని
ఇప్పటికి కూడా ప్రతి మదర్స్ డే కి ఈ సినిమాలో పాట కచ్చితంగా ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. పాట ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
End of Article