Ads
ఏ ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ లో అయినా కూడా గొడవలు అవుతూ ఉంటాయి అని అంటారు. కానీ ఎక్కువగా గొడవలు జరిగి, అవి బయటికి వచ్చేవి మాత్రం పెళ్లి విషయంలోనే. పెళ్లయిన తర్వాత కొన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్య గొడవలు జరిగితే, అది వారి వరకు మాత్రమే ఉండకుండా వారి తల్లిదండ్రుల వరకు వెళుతుంది. దాంతో పెద్దలు కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది.
Video Advertisement
అయితే మన భారతదేశంలో పెళ్లి చేసుకొని వెళ్లే ఆడపిల్ల ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? అనే విషయంపై అందరూ మాట్లాడుతారు. కానీ పెళ్లయిన తర్వాత ఒక ఒక అబ్బాయి ఎలా ఉండాలి అనే విషయంపై చాలా తక్కువగా మాట్లాడుతారు. పెళ్లి అయ్యే కొడుకుకి తన తల్లి చెప్పవలసిన కొన్ని విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
# ఒకవేళ సర్దుకుపోవడం కష్టం అయితే ఆ అమ్మాయి కూడా అతని లాగానే వేరే ఇంటి నుండి వచ్చింది అని, అతని లాగానే పెరిగింది అని ఆ తల్లి కొడుకుకి చెప్పాలి.
# చిన్నప్పటినుంచి సర్దుకుపోవడం అనేది, అలాగే కుటుంబ విలువలు నేర్పించాలి.
# పెళ్లయిన తర్వాత భార్యకి కూడా తమ తల్లికి, సోదరికి ఇచ్చినంత విలువ ఇవ్వాలి అని చెప్పాలి.
# భార్యకి పనుల్లో సహాయం చేయడంలో ఎటువంటి తప్పులేదు అని, పని షేర్ చేసుకోవాలి అని చెప్పాలి.
# ఒకవేళ భార్యకి ఏదైనా గోల్ ఉంటే అందుకు సపోర్ట్ చేయమని, ప్రోత్సహించమని చెప్పాలి.
ఇవన్నీ మాత్రమే కాకుండా అత్త కూడా కోడలికి, కూతురుకి భేదం లేకుండా చూడాలి.
End of Article