3 ఏళ్ల చిన్నారి కోసం మోడీకి మహిళ ట్వీట్..! రైలులో 20 లీటర్ల పాలు పంపిన ఐపీఎస్ ఆఫీసర్.!

3 ఏళ్ల చిన్నారి కోసం మోడీకి మహిళ ట్వీట్..! రైలులో 20 లీటర్ల పాలు పంపిన ఐపీఎస్ ఆఫీసర్.!

by Anudeep

Ads

లాక్ డౌన్ వలన రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించిపోయింది.. కేవలం ఆహారం, ఇతర నిత్యావసరాలను సరఫరా చేసేందుకే రవాణా వ్యవస్థని వినియోగిస్తున్నారు. ఈ నేపధ్యంలో తన బిడ్డకి ఒంటె పాలు కావాలని ఒక మహిళ ప్రధానిని అభ్యర్దించగానే రైల్వేవ్యవస్థ ముందుకొచ్చి సాయం చేసింది..రాజస్థాన్ నుండి ముంబైకి ఇరవై లీటర్ల పాలను తెప్పించింది..ఆ స్టోరీ వివరాలు..

Video Advertisement

ఆటిజంతో బాధపడుతున్న తన మూడున్నరేళ్ల కుమారుడికి ఒంటె పాలు కావాలంటూ ప్రధానిని అభ్యర్దిస్తూ ఒక మహిళ చేసిన ట్వీట్ పై రెస్పాండ్ అయింది రైల్వే డిపార్ట్ మెంట్ . ముంబైలోని బాంద్రాలో నివసించే నేహాకుమారి కుమారుడి వయసు మూడున్నరేళ్లు. ఆటిజంతో బాధపడుతున్న ఆ బాబుకి ఆరోగ్యరిత్యా ఒంటె పాలు తప్ప మరే పాలు శ్రేయస్కరం కాదు. 21 రోజుల లాక్‌డౌన్ కారణంగా  నేహాకుమారి కుమారుడికి ఒంటె పాలు అందడం లేదు. దాంతో ఏం చేయాలో పాలుపోక  ప్రధానమంత్రికి ట్వీట్ చేసింది. తన కుమారుడు కేవలం ఒంటె పాలపైనే ఆధారపడి ఉన్నాడని, కాబట్టి ఒంటె పాలను కానీ లేక రాజస్థాన్‌లోని సాద్రీలో లభ్యమయ్యే పాల పౌడర్‌ను కానీ అందించాలని కోరింది .

మహిళ ట్వీట్ చేసిన వెంటనే రైల్వే టీం రంగంలోకి దిగింది. రాజస్థాన్ నుండి ముంబైకి పాలు తీసుకొచ్చే మార్గం ఆలోచించింది. లూథియానా నుండి ముంబై కి ఒక పార్శిల్ రైల్ రవాణా జరుగుతుంది..ఆ రైల్లో పాలు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసింది. పాలు తీసుకోవాలసిన చోట హాల్ట్ లేనప్పటికి అక్కడ 20లీటర్ల పాలు సేకరించి, బాంద్రాలో నేహా కుమారికి అందించారు. వాటిని తనతో పాటు అవసరం ఉన్నవారికి అందించాల్సిందిగా కోరారు. ఇమ్మిడియట్ గా రెస్పాండ్ అయి, తన కష్టం తీర్చిన వారికి థాంక్స్ చెప్తూ నేహాకుమారి మరో ట్వీట్ చేశారు.

లాక్ డౌన్ వేళ ఒక్కొక్కరిది ఒక్కో దీనగాధ . కొడుకు కోసం 1400కిమీ ప్రయాణించిన తల్లి,  ఎక్కడో దూరంగా ఉన్న నా కొడుక్కి ఏ తల్లైనా అన్నం పెట్టకపోదా అని తను పండించుకున్నది ప్రభుత్వానికి ఇచ్చిన మరోతల్లి. ఊరికొచ్చి మధ్యలో చిక్కుకుపోయి పిల్లల కడుపు నింపడానికి బిక్షాటన చేసిన కన్నతల్లి . ఇలా ఎందరో తల్లులు తమ పిల్లల ఆకలి,కష్టం తీర్చడం కోసం తాపత్రయపడుతున్నరు..వారి కష్టాన్ని అర్దం చేసుకుని ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ అండగా నిలుస్తున్నారు..


End of Article

You may also like