Ads
ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. మమతకు ఆకారం అమ్మ.. త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ.. తొమ్మిది నెలలపాటు కడుపులో ఉన్న బిడ్డ కోసం తపస్సు చేసి శిశువుకు జన్మనిచ్చే తల్లి కోసం ప్రపంచ వ్యాప్తంగా మే 10(ఆదివారం) 2020 నాడు మాతృదినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అమ్మలగన్న పిల్లలారా.. తల్లులు తాకిన బిడ్డల్లారా.. వృద్దాప్యం మరో పసితనం. అమ్మను పిల్లలుగా చూసుకోవడం మాతృరుణం తీర్చుకునే అవకాశం.ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డేను అందరూ అట్టహాసంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో అమ్మ ప్రాధాన్యతను తెలిపే పోస్టర్లు, ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. తమకు జన్మనిచ్చిన తల్లికి విలువైన కానుకలిచ్చి.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెలెబ్రిటీలు, ప్రముఖులు మదర్స్ డే సెలెబ్రేషన్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి అమ్మ కి మదర్స్ డే శుభాకాంక్షలు
Video Advertisement
‘మదర్స్ డే’ 17వ శతాబ్దం నుంచే
వేడుకలను 17వ శతాబ్దం నుంచే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంట్లో ఆ కేకులను కట్ చేస్తారు. అమ్మ దినోత్సవాన్ని ఏ దేశంలో ఏవిధంగా జరుపుకున్నా అవన్నీ ఆమె ప్రేమకు సరితూగలేవు.ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డేను అందరూ అట్టహాసంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో అమ్మ ప్రాధాన్యతను తెలిపే పోస్టర్లు, ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Best Mother’s Day Quotes in Telugu (‘మదర్స్ డే’ )
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ.. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ…! మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
“ “అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు… కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు.. నాకు మరో జన్మంటూ ఉంటే.. నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మా” “గుడి లేని దైవం అమ్మ… కల్మషం లేని ప్రేమ అమ్మ.. అమృతం కన్నా తియ్యనైన పలుకు అమ్మ… నా గుండె పలికే ప్రతి మాట అమ్మ.!! మాతృదినోత్సవ శుభాకాంక్షలు !
” “అమ్మ…. నా రేపటి భవిష్యత్ కోసం.. శ్రమించే నిత్య శ్రామికురాలు.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు!”
అమ్మంటే అంతులేని సొమ్మురా.. అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసున అమృతమే చూడరా.. అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా.. – హ్యపీ మదర్స్ డే
పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ.. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ. ‘మదర్స్ డే’ …
‘వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు.. అమ్మ’’ – మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
గుడిలేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తియ్యనైన పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాట అమ్మ! మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!”
ఈ ప్రపంచం మనల్ని చూడకముందే ప్రేమించే ఒకే ఒక స్త్రీ… అమ్మ ….మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
అమ్మ లేని చోటు అంటూ ఏది ఉండదు.అమ్మ గురించి ఎంత చెప్పిన తరగని భావం అమ్మ.అపురూపంగా చూసుకునే అమ్మకి..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
అమ్మ ఆ అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమను పంచాల్సిన బాధ్యత మనపై ఉంది. అమ్మను ప్రేమిద్దాం.. ప్రేమ పంచుదాం.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2020.
ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా మాతృమూర్తితో ఉన్న అనుబంధం గొప్పది. అందుకే ఆమె రోజంతా ఎన్ని బాధ్యతలు నిర్వహించినా ఎక్కువ భాగం ఇంటికే ప్రాధాన్యం ఇచ్చి తన కుటుంబ అవసరాలను తీర్చటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అమ్మ.. సృష్టిలో విలువైన వ్యక్తి.. అమ్మ.. సహనానికి మారుపేరు… అమ్మ.. ఓ నిజమైన మార్గదర్శి..
End of Article