భారతదేశంలోనే పెళ్లి చేసుకోండి అని నరేంద్ర మోడీ ఎందుకు చెప్పారు..? ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది..?

భారతదేశంలోనే పెళ్లి చేసుకోండి అని నరేంద్ర మోడీ ఎందుకు చెప్పారు..? ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది..?

by Mounika Singaluri

విదేశాలతో పోలిస్తే భారత్ లో జరిగే పెళ్లిళ్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. విదేశాలలో చాలా సింపుల్ గా పెళ్లి జరిగిపోతుంది. కానీ భారత్ లో అలా కాదు పెళ్లి అనేది లైఫ్ లో ఒక్కసారి వచ్చే ఈవెంట్ కాబట్టి భారీగా ఖర్చు చేస్తారు. లక్ష రూపాయల నుండి కోట్ల రూపాయల వరకు పెళ్లికి ఖర్చు చేసే వారు ఉంటారు. అయితే చాలామంది ధనవంతులు ఇటీవల పెళ్లిళ్ల కోసం భారత్ లో కాకుండా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటు విదేశాలకు వెళ్తున్నారు.

Video Advertisement

తాజాగా నరేంద్ర మోడీ మనకి బాత్ కార్యక్రమంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ పైన ఆందోళన వ్యక్తం చేసి భారత్ లోనే పెళ్లి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసలు మోడీ అలా ఎందుకు చెప్పారో తెలుసుకుందాం…!


మన దేశ రాజధాని ఢిల్లీలోనే పెళ్లిళ్ల సీజన్‌లో నాలుగు లక్షల వివాహాలు జరుగుతున్నాయి. ఈ మొత్తం పెళ్లిళ్లకు అయ్యే ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.ఈ పెళ్లిళ్ల కారణంగా మన దేశంలో రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. వాణిజ్య సంస్థ CAT అంచనాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఒక పెళ్లికి రూ.3 లక్షల వ్యయం చొప్పున దాదాపు 7 లక్షల వివాహాలు జరుగుతాయి. అలాగే.. రూ.6 లక్షల ఖర్చు చొప్పున 8 లక్షల వివాహాలు, రూ. 10 లక్షల ఖర్చు చొప్పున 10 లక్షల వివాహాలు జరుగుతాయని చెప్పింది.

అంతేకాదు.. రూ.15 లక్షల ఖర్చు చొప్పున 7 లక్షల వివాహాలు, రూ.25 లక్షలు చొప్పున 50 వేలు, రూ.50 లక్షలు ఖర్చయ్యే ఐదు లక్షల పెళ్లిళ్లు, ఒక 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు వివాహాలు 50 వేలు జరుగుతాయి. ఒకవేళ ఈ పెళ్లిళ్లన్ని భారతదేశం వెలుపల విదేశాల్లో జరిగితే మాత్రం.. ఆ డబ్బంతా విదేశాలకు వెళ్తుంది. దీంతో.. భారత ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ వల్ల పెళ్లి ఖర్చులో 50% మాత్రమే భారత్ కి వస్తుంది మిగతాదంతా విదేశాలకు వెళ్ళిపోతుంది. అలాగే పెళ్లి ఈవెంట్ పైన ఎందరో ఆధారపడి జీవిస్తున్నారని వారందరికీ జీవన ఉపాధి కోల్పోతుందని మ్యారేజ్ ఈవెంట్స్ వారు చెబుతున్నారు.

ఇప్పుడు మన భారతదేశంలో ధనవంతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2022లో రూ.8 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన సంపన్నుల సంఖ్య 7,97,714కు చేరింది. 2027 నాటికి ఇది 16,57,272కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సంపన్నులందరూ డెస్టినేషన్ వెడ్డింగ్‌పైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారని CAT సంస్థ భావిస్తోంది. ఈ సంపన్నులంతా విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటే.. భారత్ ఆర్థిక వ్యవస్థ తప్పకుండా దెబ్బతింటుంది. అందుకే.. ప్రధాని మోదీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవద్దని ప్రత్యేకంగా కోరారు.

 

Also Read:ఎన్నికల ఇంక్” గురించి ఈ విషయాలు తెలుసా.? 10 రోజులైనా ఎందుకు మరక పోదు.?

 


You may also like

Leave a Comment