“ఎన్నికల ఇంక్” గురించి ఈ విషయాలు తెలుసా.? 10 రోజులైనా ఎందుకు మరక పోదు.?

“ఎన్నికల ఇంక్” గురించి ఈ విషయాలు తెలుసా.? 10 రోజులైనా ఎందుకు మరక పోదు.?

by Mohana Priya

Ads

ఒక వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అనే దానికి గుర్తుగా చేసే పని ఆ వ్యక్తి వేలిపై ఇంక్ వేయడం. దానిని ఇండెలిబుల్ ఇంక్ అంటారు. ఇండెలిబుల్ అంటే తొందరగా చెరగనిది అని అర్థం. పేరుకి తగ్గట్టుగానే వేలిపై వేసిన ఇండెలిబుల్ ఇంక్ పోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఇండెలిబుల్ ఇంక్ వేలిపై వేసినప్పుడు బ్లూ కలర్, పర్పుల్ కలర్ మిక్స్ చేసినట్టు ఉంటుంది.

Video Advertisement

మైసూర్ నగరంలో ఉన్న మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఇండెలిబుల్ ఇంక్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇండెలిబుల్ ఇంక్ ని ఉత్పత్తి చేయడానికి భారత దేశంలో ఉన్న ఒకే ఒక్క సంస్థ ఇది. ఈ సంస్థ కర్ణాటక ప్రభుత్వం యాజమాన్యంలో, మైసూర్ సిటీ కార్పొరేషన్ మాజీ మేయర్ అనంత అధ్యక్షతన ఉంది.

1937 సంవత్సరంలో మైసూర్ మహారాజా, నల్వాడి కృష్ణరాజ వడయార్ చేత మైసూర్ లాక్ అండ్ పెయింట్స్ లిమిటెడ్ పేరుతో ఈ సంస్థ ప్రారంభించబడింది. 1947 లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. 1962 లో, ఇండెలిబుల్ ఇంక్ తయారు చేయడానికి ఈ సంస్థని ఎన్నుకున్నారు. భారతదేశంలో మూడవ జనరల్ ఎలక్షన్ లో దీనిని మొదటిసారిగా ఉపయోగించారు.

ఇండెలిబుల్ ఇంక్ లో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇంక్ వేలిపై వేసినప్పుడు 40 సెకండ్లలో ఆరిపోయి ఒక మరక లాగా ఏర్పడుతుంది. దీని వల్ల చర్మానికి ఎటువంటి హాని జరగదు. పాత స్కిన్ సెల్స్ చచ్చిపోయి, కొత్త స్కిన్ సెల్స్ వచ్చినప్పుడు వేలి మీద ఉన్న ఇంక్ మరక పోతుంది.

ఇండెలిబుల్ ఇంక్ ని నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా రూపొందించిన కెమికల్ ఫార్ములా ఆధారంగా తయారుచేస్తారు. దీన్ని తయారు చేసే విధానాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు. ఇండెలిబుల్ ఇంక్ దాదాపు 20 రోజుల వరకు ఉంటుంది. ఎవరైనా మళ్లీ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదా వేరే పనులకు పాల్పడకుండా ఉండడానికి ఇంక్ ఎక్కువ రోజులు ఉండేలా చూసుకుంటారు.


End of Article

You may also like