Ads
సాధారణంగా మన సినిమా ఇండస్ట్రీలో అందరి కంటే ఎక్కువగా డబ్బులు ఉన్న హీరోలు ఎవరు అంటే, మనకి మన స్టార్ హీరోలు గుర్తొస్తారు. కానీ వారందరి కంటే కూడా రిచ్ అయిన ఒక హీరో ఉన్నారు. కానీ ఆయన స్టార్ హీరో కాదు. ఆ హీరోనే సచిన్ జోషి. సచిన్ జోషి తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు. సచిన్ జోషి ఒక వ్యాపారవేత్త కూడా. ప్రముఖ కంపెనీ జే ఎన్ జే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయిన జగదీష్ జోషి కొడుకు సచిన్ జోషి.
Video Advertisement
సచిన్ జోషి 2002 లో వచ్చిన మౌనమేలనోయి సినిమాతో తన కెరియర్ మొదలుపెట్టారు. ఆ తరువాత అదే సంవత్సరంలో నిన్ను చూడక నేనుండలేను సినిమాలో నటించారు. ఆ తర్వాత 2005 లో ఒరేయ్ పండు సినిమాలో నటించారు. 2011 లో ఆజాన్ అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టారు సచిన్ జోషి. ఆతర్వాత 2013లో ముంబై మిర్రర్, జాక్పాట్ సినిమాల్లో నటించారు.
ఆ తర్వాత తెలుగులో ఆషికి 2 రీమేక్ అయిన నీ జతగా నేనుండాలి సినిమాలో నటించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత వీరప్పన్, అమావాస్ అనే హిందీ సినిమాల్లో, నెక్స్ట్ ఏంటి, వీడెవడు అనే తెలుగు సినిమాల్లో నటించారు. నటుడిగా తన కెరీర్ మొదలు పెట్టకముందే సచిన్ జోషి వ్యాపారవేత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.
వైకింగ్ వెంచర్స్ అనే ఒక కంపెనీకి అధిపతి సచిన్ జోషి. ఈ కంపెనీ కింగ్ ఫిషర్ బీర్ అమ్ముతుంది. సచిన్ జోషి విజయ్ మాల్యా యొక్క కింగ్ ఫిషర్ విల్లాని కొనుగోలు చేశారు. ఈ విల్లా ఖరీదు దాదాపు 73 కోట్ల వరకు ఉంటుంది. 2012లో నటి ఊర్వశి శర్మని వివాహం చేసుకున్నారు సచిన్. కొన్ని నెలల క్రితం సచిన్ ఒక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులో అరెస్టయ్యారు. ఈ కేస్ గురించి సంబంధించిన వివరాలు ఏవి మళ్లీ తెలియలేదు.
End of Article