Ads
సినిమాల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితులకు చాలా డిఫరెంట్ గా ఫిక్షనల్ గా ఉంటాయి. కొన్ని సినిమాలు పూర్వ కాలంలో ఎలా ఉండేదో, లేకపోతే ఒకవేళ ఈ కథ ఆ టైంలో జరిగితే ఎలా ఉంటుందో అన్నట్టు చూపిస్తాయి. వాటిని సోషియో ఫాంటసీ అంటారు.
Video Advertisement
అయితే కొన్ని సినిమాలు మాత్రం చాలా నాచురల్ గా ఉంటాయి. ఆ సినిమాలో పాత్రలు కూడా మనం తరచుగా చూసే వాళ్ళ లాగానే అనిపిస్తారు. వాళ్ళ ఆలోచనలు కూడా మన ఆలోచనల లాగానే అనిపిస్తాయి. వాళ్ళని చూస్తే “ఇలాంటి మనుషులు నిజంగా ఉంటే ఎంత బాగుంటుందో” అనిపిస్తుంది. అలా నిజ జీవితంలో ఉంటే బాగుంటుంది అనే సినిమా క్యారెక్టర్స్ కొన్ని ఇప్పుడు చూద్దాం.
#1 అరవింద్ – బొమ్మరిల్లు
ముందు తన కొడుకుకి అన్ని బెస్ట్ మాత్రమే ఇవ్వాలి అని ఆలోచించినా కూడా చివరికి తన కొడుకు నచ్చింది మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటారు. ఈ పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించారు.
#2 విజయ్ గోవింద్ – గీత గోవిందం
సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయ్ గోవింద్ లాంటి వ్యక్తి వాళ్ళ జీవితాల్లో ఉంటే బాగుంటుంది అని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్ చేశారు.
#3 భువన – రఘువరన్ బీటెక్
సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యింది ఈ పాత్రకే.
#4 శ్రావణి – మజిలీ
ఇందాక పైన విజయ్ గోవింద్ కి చెప్పినట్టుగానే శ్రావణి పాత్రకు కూడా అలాంటి వ్యక్తి వాళ్ల జీవితాల్లో ఉంటే బాగుండు అని చాలా మంది సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేశారు.
#5 లక్ష్మి – అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి
తల్లి కొడుకుల మధ్య రిలేషన్ ని తన స్టైల్ లో చాలా బాగా చూపించారు పూరి జగన్నాథ్.
#6 రాధిక – వాసు
ఈ సినిమాలో తనని ఎవరు నమ్మినా నమ్మకపోయినా రాధిక మాత్రం వాసు తను అనుకున్నది కచ్చితంగా సాధిస్తాడు అని నమ్ముతుంది.
#7 శివ – అర్జున్ రెడ్డి
ఈ సినిమా చూసిన తరువాత అర్జున్ రెడ్డి పాత్రతో పాటు ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడింది శివ పాత్ర గురించే.
#8 బేబీ – ఓ బేబీ
తన మనవడు చేసే ప్రతి ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తుంది బేబీ.
#9 అర్జున్ – జెర్సీ
అర్జున్ కి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అవి తన కుటుంబం మీదకి ప్రభావం పడనివ్వడు. ఈ సినిమాలో హీరో కొడుకు పాత్ర అయిన నాని పాత్రని కేవలం చిన్న పిల్లాడిలాగా కాకుండా సినిమాలో ఒక ముఖ్య పాత్రగా చూపించారు.
#10 వాసు, శ్రీను – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
వీళ్ల ముగ్గురి ఫ్రెండ్ షిప్ ఎంత స్ట్రాంగో అని చెప్పడానికి సినిమా చివరిలో హీరోకి దెబ్బలు తగిలాయి అని తెలియగానే వాసు తన పెళ్లిని కూడా వదిలేసి వెళ్ళిపోయే సీన్ ఒకటి చాలు.
#11 చిత్ర – పెళ్లి చూపులు
చిత్ర తను అనుకున్నది అనుకున్నట్లు ధైర్యంగా మాట్లాడుతుంది. తన నిర్ణయాలు తను తీసుకుంటుంది. మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ తనకి కావాల్సిన దాని మీద పట్టువదలకుండా ఫోకస్ చేస్తుంది. టైం పట్టినా కూడా తను అనుకున్నది సాధిస్తుంది. ఇలా చిత్ర పాత్ర చాలా మందికి స్ఫూర్తినిచ్చింది.
End of Article