Ads
రకరకాల పాత్రలు పోషించి, విలక్షణ నటుడు అనే పదానికి అందం తీసుకొచ్చిన నటుల్లో ముందుగా గుర్తొచ్చే నటుడు ప్రకాష్ రాజ్. సినిమాకి తగ్గట్టు తన ఆహార్యాన్ని, తన యాసని మార్చుకుంటారు. ప్రకాష్ రాజ్ తెలుగు మాట్లాడితే, ఒక తెలుగు వారు తెలుగు మాట్లాడినట్టే ఉంటుంది. మిగిలిన భాషలు కూడా అంతే అనర్గళంగా మాట్లాడుతారు. ప్రకాష్ రాజ్ కేవలం మంచి నటులు మాత్రమే కాదు. మంచి దర్శకులు కూడా. కొన్ని కొత్త రకమైన కాన్సెప్ట్ ఉన్న సినిమాలని ప్రకాష్ రాజ్ రూపొందించారు. అందులో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా పేరు మన ఊరి రామాయణం. ఈ సినిమాకి ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించారు.
Video Advertisement
ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్ అనే బ్యానర్స్ మీద ఈ సినిమాని నిర్మించారు. ఇళయరాజా ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. కన్నడలో ఈ సినిమా ఇదొల్లె రామాయణ పేరుతో రూపొందించారు. తెలుగులో ఈ సినిమాలో ప్రియమణి, సత్య దేవ్, రఘు బాబు, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. భుజంగ (ప్రకాష్ రాజ్) అనే ఒక వ్యక్తి చుట్టూ ఈ కథ నడుస్తుంది. సుశీల (ప్రియమణి) తో భుజంగ ఒక సారి స్నేహంగా ఉంటాడు. అప్పటికే ఆయనకి వేరే ఆవిడతో పెళ్ళయ్యి, ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
2016 లో వచ్చిన ఈ సినిమా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. సినిమాలో నటులు కనిపించరు. కేవలం వారి పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ప్రకాష్ రాజ్ మరొక డిఫరెంట్ పాత్రని ఈ సినిమాలో పోషించారు. ప్రియమణి కూడా నటనకి ఆస్కారం ఉన్న పాత్రలో నటించారు. సత్యదేవ్ నటనకి చాలా అభినందనలు వచ్చాయి. ఈ సినిమాలో కాస్త కామెడీ టచ్ ఉన్న పాత్రలో సత్యదేవ్ నటించారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. క్రిటిక్స్ కూడా ఈ సినిమాని చాలా పొగిడారు.
End of Article