సెటిలర్స్ – సినీ ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రాధాన్యం..మంత్రి పదవి ఖాయం

సెటిలర్స్ – సినీ ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రాధాన్యం..మంత్రి పదవి ఖాయం

by Jyosthna Devi

Ads

తెలంగాణలో సెటిలర్స్ సంఖ్య గణనీయంగా ఉంది. బీఆర్ఎస్ పాలనలో వారికి గుర్తింపే లేదు. ఓట్ల కోసం తప్ప, వారిని పలకరించే వారు లేరు. కాంగ్రెస్ ఇప్పుడు కొత్త వ్యూహం సిద్ధం చేస్తుంది. సెటిలర్స్ కు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇదే సమయంలో సినీ పరిశ్రమ సమస్యలపైన కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. సెటిలర్స్ తో పాటుగా సినీ పరిశ్రమకు చెందిన వారికి టకెట్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. హైదరాబాద్ కి సినీ పరిశ్రమను తీసుకొచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకొస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సెటిలర్లు..సినీ పరిశ్రమకు చెందిన వారికి మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు.

Video Advertisement

కాంగ్రెస్ లెక్క మూమూలుగా లేదు. ఏ ఒక్క రంగాన్ని, ఏ వర్గాన్ని ఈ సారి వదులుకోకూడదని నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ సమయం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం సెటిలర్లను కేవలం ఓటర్లుగానే చూస్తూ వచ్చారు. వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజకీయంగా వారికి ఎటువంటి అవకాశాలు దక్కలేదు. తెలంగాణ ప్రజలతో మమేకం అవుతూ హైదరాబాద్ ఇమేజ్ పెంచటంలో వారంతా భాగస్వాములుగా ఉన్నారు. వీరికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో సెటిలర్లకు టికెట్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అదే సమయంలో మంత్రివర్గంలోనూ స్థానం కల్పించాలని యోచిస్తోంది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ అందరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పదేళ్లుగా వివక్షకు గురవుతున్న సెటిలెర్లకు ప్రాధాన్యత దిశగా ఇప్పుడు కీలక అడుగులు వేస్తుంది.

 

చెన్నైకి పోటీగా హైదరాబాద్ కు సినిమా పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ సొంతం. రాష్ట్ర విభజన తరువాత సినీ పరిశ్రమ సమస్యలు..కార్మికుల కష్టాల పైన ప్రభుత్వం ఆలోచన చేయలేదు. సినీ పరిశ్రమకు నంది అవార్డులు ఇప్పటి వరకు ఇవ్వని నిస్సహాయ స్థితిలో ఉంది. సీని పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి వచ్చే గుర్తింపును విస్మరించింది. సినిమా ఈవెంట్స్ కు హాజరవ్వటం మినహా, పరిశ్రమను మరింత వేగంగా ముందుకు వెళ్లేలా ఎటువంటి నిర్ణయాలు లేవు. ఈ సమయంలో కాంగ్రెస్ మరోసారి సినీ పరిశ్రమపైన దృష్టి సారించింది. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలోనే పరిశ్రమకు అవసరమైన భూములు, రాయితీలు, ప్రోత్సాహకాలతో అండగా నిలిచింది. దీనిని ఇప్పుడు తిరిగి కొనసాగించేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోంది.

 

టికెట్ల ఎంపికలో రాజకీయంగా ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించాలని భావిస్తోంది. టికెట్ల కేటాయింపుతో పాటుగా మంత్రివర్గంలోనూ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. పరిష్కారం కాకుండా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సినీ కార్మికుల ఇళ్ల స్థలాల విషయంలోనూ కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికై అభిప్రాయ సేకరణ, ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరగకుండా స్థలాలు అందించే కార్యాచరణ పైన కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ చేస్తున్న ఆలోచన గురించి సమాచారం అందుకున్న సినీ ప్రమఖులు ఇప్పుడు పార్టీ నాయకత్వంతో టచ్ లోకి వస్తున్నారు. సినీ పరిశ్రమ గురంచి చేస్తున్న ఆలోచనతో వారి చూపు కాంగ్రెస్ వైపు మళ్లింది.


End of Article

You may also like