హాలీవుడ్ సినిమాని బాగా పొగుడుతున్నారు..! కానీ సైన్స్ మీద వచ్చిన మన సినిమా చూశారా..?

హాలీవుడ్ సినిమాని బాగా పొగుడుతున్నారు..! కానీ సైన్స్ మీద వచ్చిన మన సినిమా చూశారా..?

by kavitha

Ads

‘గజిని’ చిత్రానికి స్ఫూర్తి నిచ్చిన ‘మొమెంటో’ సినిమా నుండి ‘టెనెట్’ వరకు అద్భుతమైన మరియు ప్రయోగాత్మక సినిమాలను తెరకెక్కించి ప్రపంచ సినీ హిస్టరీలోనే అత్యంత గొప్ప డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు  క్రిస్టోఫర్ నోలన్. ఆయన సినిమాలకు ఇండియాలో కూడా భారీగా ఫ్యాన్ బేస్ ఉంది.

Video Advertisement

తాజాగా క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా ‘ఓపెన్ హైమర్’ రిలీజ్ అయ్యింది. అణుబాంబు పితామ‌హుడు, భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒపెన్ హైమర్ యొక్క జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ ఓపెనింగ్స్ పరంగా కూడా నంబర్ వన్ మూవీగా నిలిచింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో హాలీవుడ్ సినిమాని బాగా పొగడ్తున్నారు. కానీ అలా సైన్స్ మీద వచ్చిన మన సినిమాని చూసారా అని కామెంట్స్ పెడుతున్నారు.
Oppenheimer-Movie‘ఓపెన్ హైమర్’ మూవీకి విడుదలకి ముందు ఇండియాలో వచ్చిన హైప్ మామూలుగా లేదు. ఈ మూవీ రిలీజ్ రోజు ప్రాంతీయ భాషల్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా, భారతీయ బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం ‘ఓపెన్ హైమర్’ కే నంబర్ వన్ గా నిలిచింది. ఆ మూవీకి కొన్ని రోజుల ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఓపెనింగ్స్ విషయంలోనూ ‘ఓపెన్ హైమర్’ నంబర్ వన్ మూవీగా నిలిచింది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజెన్లు హీరో మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన సినిమా ‘రాకెట్రీ’ ని పోలుస్తున్నారు. ఈ మూవీ ప్రముఖ భారతీయ ఎయిరోస్సేస్ శాస్త్రవేత్త, పద్మభూషణ్ నంబీ నారాయణ్ లైఫ్ ఆధారంగా తెరకెక్కింది. ఇస్రో పరిశోధనలకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ ను వేరే దేశానికి లీక్ చేశాడనే కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. కానీ సీబీఐ దర్యాప్తులోను, సుప్రీంకోర్టు విచారణలోను తనకు తాను నిర్దోషిగా నంబి నారాయణ్ నిరూపించుకొన్నారు. ఈ మూవీ గత ఏడాది మే 19న రిలీజ్ అయ్యి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియయల్ గా హిట్ అందుకోలేదు. ‘ఓపెన్‌హీమర్’ మూవీని చూడటానికి థియేటర్‌లకు వచ్చిన యువతలో 30% మంది అయినా భారతీయ గొప్ప సైంటిస్ట్ హృదయ విదారక కథతో తెరకెక్కిన ‘రాకెట్రీ’ ని థియేటర్‌లలో చూసి ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: గుర్తింపు తెచ్చిన సినిమా టైటిల్ నే తమ పేరుకి యాడ్ చేసుకున్న 12 మంది సినీ సెలబ్రిటీస్.!


End of Article

You may also like