Home News “నా వాడంటే నా వాడు” అంటూ కొట్టుకున్న అమ్మాయిలు.. చివరకు టాస్ వేసి.. ఇంత వెరైటీ లవ్ స్టోరీ ఎక్కడా చూసుండరు..!

“నా వాడంటే నా వాడు” అంటూ కొట్టుకున్న అమ్మాయిలు.. చివరకు టాస్ వేసి.. ఇంత వెరైటీ లవ్ స్టోరీ ఎక్కడా చూసుండరు..!

by Anudeep

ట్రయాంగిల్ లవ్ స్టోరీలు మనకి కొత్త కాదు కానీ.. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్లైమాక్స్ ని మాత్రం ఎక్కడా చూసుండరు. ఇంతకీ ఈ ఇంటరెస్టింగ్ స్టోరీ సంగతేంటో చూద్దాం. సాధారణం గా ఏ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో అయినా ఇద్దరు అమ్మాయిలు ఒకబ్బాయినో.. లేక ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలనో ఇష్టపడతారు. చివరికో ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే మరొకరు త్యాగం చేయాల్సి వస్తుంది.

love story 2

ఇలాంటి ఘటన ఒకటి కర్నాటకలోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ అబ్బాయి ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు. అయితే.. ఆ విషయం కొన్నాళ్ళకి ఇద్దరి అమ్మాయిలకి తెలిసింది. వారిద్దరూ ఆ అబ్బాయిని తిట్టకపోగా నా వాడంటే నా వాడు అంటూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు. వీరి సమస్యని ఎలా పరిష్కరించాలో వారి పెద్దలకే అర్ధం కాలేదు.

love story 3

అంతలోనే ఆ ఇద్దరు యువతుల్లో ఓ అమ్మాయి ఆ అబ్బాయి లేకుండా బతకలేను అంటూ ఆత్మహత్య కు ప్రయత్నించింది. అప్పటికే విషం మింగేసిన ఆమె అతికష్టం మీద ప్రాణాలతో బయటపడింది. దీనితో.. ఈ విషయం తొందరగా తేల్చకపోతే మరిన్ని అనర్ధాలు జరిగే అవకాశం ఉందని పెద్దలు భావించారు. చివరకు టాస్ వేయాలని నిర్ణయించారు. టాస్ గెలిచిన వారితో ఆ అబ్బాయి వివాహం జరుగుతుందని, టాస్ ఓడిన వారు అన్యాయం జరిగింది అంటూ కేసు పెట్టకూడదని షరతు విధించారు.

love story 1

ఇందుకు ఆ ఇద్దరు అమ్మాయిలు ఒప్పుకున్నారు. టాస్ వేసిన తరువాత ఆత్మహత్య చేసుకుని బయటపడ్డ అమ్మాయి గెలుపొందింది. దీనితో.. ఊరి పెద్దలు, ఇరు కుటుంబాలు కలిసి ఆ అమ్మాయితో అబ్బాయి పెళ్లి జరిపించారు. టాస్ ఓడిపోయిన అమ్మాయి కొంత నిరాశ పడ్డప్పటికీ.. పెళ్లి కూతురుని హగ్ చేసుకుని శుభాకాంక్షలు తెలిపింది. వెళ్ళిపోతూ.. ఆ అబ్బాయి చెంప పై లాగిపెట్టి కొట్టి వెళ్ళిపోయింది. ఇప్పటితో ఇది ముగిసిపోలేదని.. మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి వీరి కథ సుఖాంతమైంది.

love story 4

You may also like