ఇంత పెద్ద సినిమా రిలీజ్ అయినట్టు కూడా మర్చిపోయారా..? దీని సంగతి ఏంటి..?

ఇంత పెద్ద సినిమా రిలీజ్ అయినట్టు కూడా మర్చిపోయారా..? దీని సంగతి ఏంటి..?

by kavitha

Ads

మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరో టామ్ క్రూజ్ చేసే సాహస విన్యాసాలకు భారత్ కి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ సిరీస్ లో మిషన్ ఇంపాజిబుల్ 7 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Video Advertisement

ఇప్పటి వరకు వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వయసు పెరుగుతున్నా, తన అద్బుతమైన సాహస విన్యాసాలతో ప్రేక్షకులని అలరించే హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ 7 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Mission-Impossible-7టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ కి ఇండియాలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ట్రైలర్ తో ఇప్పటికే వావ్ అనిపించిన మిషన్ ఇంపాజిబుల్ 7  సినిమా పై హైప్ పెంచుతూ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలతో ఈ మూవీ మరింత క్రేజ్ పెరిగింది. దాంతో ఈ సిరీస్ నుండి కొత్త మూవీ వస్తున్న ప్రతిసారి ఆడియెన్స్ ఎగ్జైటెడ్ గా ఉంటారు. దానికి తగినట్టుగా మిషన్ ఇంపాజిబుల్ 7 వచ్చింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయ్యింది. ఈ మూవీకి ఇండియాలో కూడా ఎక్కువ థియేటర్లు లభించాయని తెలుస్తోంది. ఈ మూవీ కథ విషయనికి వస్తే, సముద్రంలో మునిగిపోయిన ఒక సబ్ మెరైన్ లో ప్రపంచానికి చెడు చేసే ఒక రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యాన్ని కనిపెట్టాలంటే 2 భాగాలు ఉన్న తాళం చెవి కావాలి. ఆ తాళం చెవిని వెతికే బాధ్యతను ప్రభుత్వ ఆఫీసర్లకి అప్పగిస్తుంది. వారితో పాటు హంట్ (టామ్ క్రూజ్) కూడా రంగంలోకి దిగుతాడు. కీ వెతికే సమయంలో వారికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొని ఫైనల్ కీని ఎలా సంపాదిస్తారు అనేది కథ.
మూవీ సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సన్నివేశాలతో నడిపించారు. స్టోరీ పరంగా గొప్పగా ఏమీ  లేకపోయినా యాక్షన్ లవర్స్ కోరుకునే సీన్స్ మాత్రం అభిమానులని చాలా ఇంప్రెస్ చేస్తాయి. యాక్షన్ ప్రియులను  మెప్పించేలా మూవీ ఉన్నా లెంగ్త్ ఎక్కువయిన భావన వస్తుంది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ఫ్యాన్స్  అంచనాలను రీచ్ అయ్యేట్టు ఉంది. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ఆడియెన్స్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా మూవీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు.

Also Read: NAYAKUDU REVIEW : “ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, వడివేలు” నటించిన నాయకుడు ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 


End of Article

You may also like