ఈ సినిమాని అంతరిక్షం లోనే షూట్ చేస్తున్నారు.. అమెరికా కి పోటికోసమే రష్యా ఎత్తు..?

ఈ సినిమాని అంతరిక్షం లోనే షూట్ చేస్తున్నారు.. అమెరికా కి పోటికోసమే రష్యా ఎత్తు..?

by Anudeep

Ads

అంతరిక్షం అనేది చాలా ఇంటరెస్టింగ్ సబ్జెక్టు. ఇప్పటికే.. ఈ కాన్సెప్ట్ పైన చాలా సినిమాలు వచ్చాయి. అయితే.. ఇలాంటి సినిమాల కోసం షూటింగ్ ను స్టూడియోలలో పూర్తి చేసి గ్రాఫిక్స్ తో మాయ చేస్తారు. అయితే.. రష్యా లో మాత్రం షూటింగ్ ను అంతరిక్షం లోనే చేయాలనీ ప్లాన్ చేసారు. ఇందుకోసం.. దర్శకుడు, నటి ని అక్టోబర్ లో అంతరిక్షం పంపబోతున్నట్లు రష్యా ప్రకటించింది.

Video Advertisement

movies in space

దీనివెనకాల అసలు కారణం వేరే ఉందని అంటున్నారు. ఎలోన్ మస్క్ కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌‌ విజయాల బాట పట్టింది. అయితే.. దీనితో పోటీ పడడానికి మాస్క్ అంతరిక్ష సంస్థ కూడా ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు.. అమెరికన్ నటుడు టామ్ క్రూజ్ అంతరిక్షం లో సినిమా తీయడం కోసం నాసా తో జత కడుతున్నట్లు నాసా గతేడాది ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే అమెరికా కి పోటీ గా రష్యా కూడా పావులు కదుపుతోందని విశ్లేషకుల మాట. ఈ క్రమం లోనే ఈ సినిమా ప్రాజెక్ట్ గురించి ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు “ఛాలెంజ్” అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టారు. ప్రముఖ రష్యన్ నటి యులియా పెరెసిల్డ్‌, నటుడు క్లిమ్ షిపెంకోఈ సినిమా లో నటించనున్నారు. రష్యా ప్రభుత్వ-నెట్‌వర్క్ ఛానల్ వన్ రోస్కోస్మోస్ అధిపతి, డిమిత్రి రోగోజిన్, సంయుక్తం గా ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.


End of Article

You may also like