కాజల్, రెజీనా కలిసి యాక్ట్ చేశారా..? ఈ హారర్ సినిమా చూశారా..?

కాజల్, రెజీనా కలిసి యాక్ట్ చేశారా..? ఈ హారర్ సినిమా చూశారా..?

by kavitha

Ads

కాజల్‌ అగర్వాల్‌, రెజీనా కాసాండ్రా లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘కరుంగాపియం’. ఈ చిత్రానికి కార్తికేయన్‌ (డీకే) దర్శకత్వం వహించారు. యోగిబాబు, రైజా విల్సన్‌, జనని వంటివారు ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ మూవీని 5 స్టోరీలతో ఆంథాల‌జీగా రూపొందించారు.

Video Advertisement

మే 19న కరుంగాపియం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తెలుగులో కార్తీకగా రిలీజ్ అయ్యింది. కానీ అంతగా  ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం జులై 10 నుండి అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్‌ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. కాజల్ అగర్వాల్‌ నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కాజల్ అగర్వాల్‌ నటించిన హారర్ సినిమా కరుంగాపియమ్. ఈ మూవీ కథ విషయనికి వస్తే, కార్తిక (రెజినా) ఒక పాత  లైబ్రరీకి వెళుతుంది. వందేళ్ల క్రితం రాసిన ‘కాటుక బొట్టు’ అనే బుక్ కనిపిస్తుంది. దాంతో ఆమె ఆ బుక్ చదవడం మొదలు పెడుతుంది. అయితే ఆమె చదివే క్యారెక్టర్లన్నీ దెయ్యాలుగా కార్తిక ముందుకు వస్తుంటాయి. వాటిలో కాజల్‌(కార్తిక) ఉంటుంది. ఆమె పగ తీర్చుకోవడం కోసం దెయ్యంగా మారుతుంది. ఇంతకి కాజల్‌ ఎలా చనిపోయింది. ఆమె తన పగను ఎలా తీర్చుకుంటుంద? ఇక రెజీనా క్యారెక్టర్ ఏమిటి అనేది మిగతా కథ.
5 క‌థ‌ల‌తో ఆంథాల‌జీగా రూపొందిన హార‌ర్ సినిమా ఇది. రెజీనా క్యారెక్టర్ ద్వారా ఒక్కో స్టోరీని డైరెక్ట‌ర్ పరిచయం చేశాడు. కార్తిక ఎపిసోడ్స్‌ను సీరియ‌స్ హార‌ర్ స్టోరీగా తీశాడు. మిగిలిన 3 క‌థ‌ల్ని కామెడీ, హార‌ర్ కలిపి ఆక‌ట్టుకునేందుకు ట్రై చేశాడు. రెజీనాకు ఈ 5 క‌థ‌ల‌కు కనెక్షన్ ఉంద‌ని చూపించే ట్విస్ట్ బాగుంది. ఆ ట్విస్ట్‌తోనే మూవీని ఎండ్ చేసి, పార్ట్ -2 ఉంద‌ని చూపించాడు.
కాజ‌ల్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్‌గా నిలిచింది. ఫుచర్ ను ఊహించే శ‌క్తి కల మ‌హిళ‌గా కాజల్ అగర్వాల్‌ ఆక‌ట్టుకుంది.  అర‌వ కామెడీని భ‌రించ‌డం కొంచెం క‌ష్ట‌మే. హార‌ర్ ట్విస్ట్‌ల‌న్నీ ఇంతకు ముందు చాలా చిత్రాలలో వ‌చ్చిన‌వే. కొన్ని పాత్రలు ఎందుకొస్తున్నాయో తెలియ‌ని గందరగోళంలో సినిమాను ఎండ్ చేశారు.

Also Read: “నిహారిక కొణిదెల-చైతన్య” విడాకుల తర్వాత మొదటి సారిగా స్పందించిన చైతన్య తండ్రి..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like