Ads
సినిమాలకి కథ, దర్శకత్వం, పాటలు, ఫైట్స్, హీరో హీరోయిన్ వీటన్నిటితోపాటు ముఖ్యమైనది టైటిల్. ఒక సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి అంటే టైటిల్ బాగుండడం కూడా చాలా ముఖ్యం. అందుకే సినిమా బృందం కూడా టైటిల్ డిఫరెంట్‌గా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా చూసుకుంటారు.
Video Advertisement
అయితే టైటిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో పాటు.. టైటిల్ వినగానే..ఆ మూవీ జోనర్ తెలిసేలా ఉండాలి. ఆ కథకి ఈ టైటిల్ సరిగ్గా సరిపోయింది అని ప్రేక్షకులు అనేలా ఉండాలి. కానీ టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన చాలా చిత్రాలకు వాటి టైటిల్స్ కి సంబంధం లేకుండా ఉన్నాయి. అలా వచ్చిన చిత్రాలేంటో చూద్దాం..
#1 సారొచ్చారు
రవితేజ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సారొస్తారా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కి, కథకి అసలు సంబంధమే ఉండదు. ఈ సినిమా నిర్మాతలకు సైతం భారీ నష్టాలను మిగిల్చింది.
#2 స్పైడర్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగ దాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం స్పైడర్. ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత మురుగదాస్ కు తెలుగులో ఆఫర్లు తగ్గాయి.
#3 ఐస్ క్రీమ్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో నవదీప్ , తేజస్వి మదివాడ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని సొంతం చేసుకుంది.
#4 బ్రూస్ లీ
చరణ్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రూస్ లీ సినిమాకు సైతం కథకు టైటిల్ కు పొంతన ఉండదు.ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఫ్లాప్ గా నిలిచింది.
#5 ఖలేజా
త్రివిక్రమ్ దర్శకత్వం లో మహేష్ హీరోగా చేసిన ఖలేజా చిత్రం ప్లాప్ అయినా .. దానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ చిత్రానికి, టైటిల్ కి సంబంధం ఉండదు.
#6 ఛలో
నాగశౌర్య హిట్ సినిమాలలో ఛలో ఒకటి కాగా ఈ సినిమాకు టైటిల్ కు ఏ మాత్రం సంబంధం లేదనే సంగతి తెలిసిందే.
#7 ఆరెంజ్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో రామ్ చరణ్, జెనిలియా జంటగా వచ్చిన చిత్రం ఆరెంజ్. ఈ సినిమా కథకి, టైటిల్ కి ఏం పొంతన ఉండదు.
#8 రాధేశ్యామ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ ప్రేక్షకులను నిరాశ పరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు టైటిల్ కు ఏ మాత్రం సంబంధం ఉండదు.
End of Article