Ads
మలయాళ సినిమాలలో ఒక సింపుల్ పాయింట్ ను తీసుకుని, దానిని తెరపై బలంగా చూపిస్తుంటారు. ఫీల్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ, తక్కువ పాత్రల మధ్య ఎమోషన్స్ ను ఎక్కువగా పండిస్తుంటారు. అలాంటి కంటెంట్ తో ఈ ఏడాది మే 12న థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రమే ‘జానకి జానే’.
Video Advertisement
ఈ చిత్రం మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 11న ప్రముఖ ఓటీటీ ‘హాట్ స్టార్’ లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా కంటెంట్ ఏమిటి? ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..ఇటీవల వచ్చిన ‘గుడ్ నైట్’ సినిమాలో హీరోకు ‘గురక’ సమస్య ఉన్నట్టే, ‘జానకి జానే’ మూవీలో హీరోయిన్ కు ‘భయం’ అనే మానసిక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో ఈ మూవీలో చూపించారు. సైజు కురుప్, నవ్య నాయర్ ప్రధాన పాత్రలలో నటించగా, జానీ ఆంటోనీ, కొట్టాయం నజీర్, జార్జ్ కోరా, అనార్కలి మరికర్, షరఫ్ వంటివారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయనికి వస్తే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి జానకి (నవ్య నాయర్), చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఫ్యామిలీ భారం ఆమె పైనే పడుతుంది. అమ్మతో ఉంటూ ఒక ప్రెస్ లో వర్క్ చేస్తుంటుంది. అయితే జానకికి భయం ఎక్కువగా ఉంటుంది. గట్టిగా ఎవరైనా మాట్లాడినా, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలన్నా, చీకటిగా ఉన్న చాలా భయపడుతుంది. ఒకసారి భయంతో జానకి స్పృహ తప్పి పడిపోగా, రోడ్ కాంట్రాక్టర్ అయిన ఉన్ని ముకుందన్ (సైజు కురుప్) రక్షించి, ఇంటికి తీసుకెళ్తాడు.
జానకిని ప్రేమించిన ఉన్ని ముకుందన్ వారి పెద్దలను ఒప్పించి మరి జానకిని పెళ్లి చేసుకుంటాడు. సంతోషంగా సాగుతున్న వీరి లైఫ్ లో ఎదురైన అనుకోని సంఘటన ఏమిటి ? దాన్ని రాజకీయ ప్రత్యర్థులు అయిన షాజీ (కొట్టాయం నజీర్), మార్టిన్ (జార్జ్ కోరా) ఎలా ఉపయోగించుకున్నారు? దానివల్ల ఉన్ని, జానకి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఆఖరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
ఈ మూవీలో భార్యకు ఉన్న భయం అనే బలహీనత కారణంగా ఆ భార్యాభర్తల మధ్య, వారి కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు వచ్చేయనేదే ఈ మూవీ స్టోరీ. సాధారణంగా అందరికీ భయం అనేది ఉంటుంది. కానీ ఆ భయం యొక్క తీవ్రత పెరిగి, అది వేరేవారికి అవకాశంగా మారితే ఎలాంటి ఇబ్బందులలోకి నెడుతుందనేది చక్కగా చూపించారు. కొన్ని చోట్ల కొంచెం బోర్ ఫిల్ అయిన, అందమైన లొకేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
Also Read: బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 కంటెస్టెంట్స్ వీళ్లేనా..? లిస్ట్ మామూలుగా లేదు..!
End of Article