Ads
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. మహానటి మూవీతో తెలుగువారికి పరిచయం అయిన దుల్కర్, సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో దుల్కర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరుగుతోంది.
Video Advertisement
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా, తక్కువ కాలంలోనే తనకంటూ గుర్తింపును సంపాదించుకుని, వైవిధ్యమైన పాత్రలను చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. మలయాళంలోనే కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషలలో నటిస్తున్నారు. ఆయన నటించిన సినిమాలలో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘ఉస్తాద్ హోటల్’ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
దుల్కర్ సల్మాన్ 2012లో ‘సెకండ్ షో’ అనే మలయాళ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది దుల్కర్ రెండవ సినిమా ‘ఉస్తాద్ హోటల్’ లో నటించాడు. ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించింది. అన్వర్ రషీద్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2012కి గాను మూడు జాతీయ అవార్డులు అందుకుంది. ‘బెస్ట్ పాపులర్ సినిమా , బెస్ట్ డైలాగ్స్, యాక్టర్ తిలకన్ కి ప్రత్యేక అవార్డు వచ్చింది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుని, భారీ కలెక్షన్స్ సాధించి, కమర్షియల్ గా విజయం సాధించింది. ఈ మూవీని తెలుగులో ‘జనతాహోటల్’ గా డబ్ చేసి, 2018 లో రిలీజ్ చేశారు.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఫైజల్ (దుల్కర్ సల్మాన్) నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన అబ్బాయి కావడంతో అతని తండ్రి, అక్కలు అల్లారుముద్దుగా పెంచుతారు. ఫైజల్ కి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. దాంతో తండ్రికి తెలియకుండా విదేశాల్లో హోటల్ మేనేజ్ మెంట్ చేశాడు. కానీ ఫైజల్ తండ్రి అతనితో స్టార్ హోటల్ పెట్టించాలని భావిస్తాడు. ఫైజల్ కి తండ్రి షహానా (నిత్యామీనన్)తో పెళ్ళిచూపులు ఏర్పాటుచేస్తాడు. ఆ సమయంలో ఫైజల్ హోటల్ మేనేజ్ మెంట్ గురించి బయటపడుతుంది.
దాంతో ఫైజల్ ను తండ్రి పాస్ పోర్ట్ తీసుకుని, ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. అప్పుడు ఫైజల్ తాతయ్య కరీంభాయ్ వద్దకు వెళ్ళి, ఆయన నడిపే “ఉస్తాద్ హోటల్”లో పనిచేస్తూ, డూప్లికేట్ పాస్ పోర్ట్ కు అప్లై చేసి, ఎదురుచూస్తుంటాడు. ఆ తరువాత తాత సహాయంతో బీచ్ బే అనే ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ గా జాయిన్ అవుతాడు. అక్కడ బీచ్ బే తమ హోటల్ ను విస్తరించడం కోసం “ఉస్తాద్ హోటల్”ను ఆక్రమించుకోబోతుందని తెలుసుకుంటాడు.
ఉస్తాద్ హోటల్ ను ఫైజల్ ఎలా కాపాడాడు ? తాత దగ్గర ఏం నేర్చుకుంటాడు ? చివరికి ఫైజల్ అనుకున్నట్టు విదేశాలకి వెళ్లాడా? లేదా అనేది మిగిలిన కథ. ఈ చిత్రంలో దుల్కర్ ఫైజల్ పాత్రలో ఒదిగిపోయారు. ఉస్తాద్ హోటల్ యాజమానిగా, ఫైజల్ తాతగా యాక్టర్ తిలకన్ జీవించారు. నిత్యామీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటు ఉంది.
Also Read: వరుస హిట్స్ తర్వాత రెమ్యూనరేషన్ పెంచేసిన నవీన్ పోలిశెట్టి..! ఎంతంటే..?
End of Article