Ads
కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు గాని కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ సినిమా విలువ తెలుసుకొని దాని పొగడడం మొదలుపెడతారు. అయితే ఇప్పుడు 2018 లో హిందీలో రిలీజ్ అయిన ఒక మూవీ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ మూవీ ని అసలు మిస్ కావొద్దు అంటూ కామెంట్ లు పెడుతున్నారు. ఇంతకీ ఏ మూవీ అంటే…. తుంబాడ్….!
Video Advertisement
ఇది ఒక మైథిలాజికల్ థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీ. ఈ మూవీ ని రాహి అనిల్ బార్వే డైరెక్ట్ చేశారు. ఇండియాలోని వన్ ఆఫ్ ది ఎవర్గ్రీన్ మూవీగా ఏ మూవీ ఉంటుందని అంటున్నారు. అసలు అంతలా ఈ సినిమాలో ఏముందంటే….!
పూర్తి దేవి అనే దేవత కడుపు లో నుండే ఈ భూమి, 16 కోట్ల మంది దేవతలు ఆమె కడుపు నుండే వచ్చారు. అందులో మొదటి సంతానం హస్తర్.దేవి d దగ్గరున్న బంగారం ధాన్యం మొత్తం తన సొంతం చేసుకోవాలని దురాశతో ఉంటాడు. బంగారం మొత్తం దక్కించుకున్న హస్తర్ ధాన్యాన్ని కూడా సొంతం చేసుకోవాలని అనుకుంటుండగా దేవతలు హస్తర్ పై దాడి చేస్తారు. అప్పుడు హస్తర్ ను పూర్తి దేవి కాపాడి ఇకపై హస్తర్ ను ఎవరు కొలవరు అందరూ అతనిని మర్చిపోతారని చెప్తుంది.
అలా కొన్ని యుగాలు గడిచిన తర్వాత హస్టర్ కు తుంబాడ్ అనే గ్రామంలో గుడి కడతారు.ఇక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. 1990 లో ఒక కుటుంబం హస్తర్ నుండి ఒక బంగారు నాణెం పొందుతుంది. అయితే ఆ బంగారం అంత సులువుగా దొరకదు హస్తర్ కు ధాన్యాన్ని ఆశగా చూపించి అతని సంచిలో నుండి బంగారాన్ని లాక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం తేడా జరిగిన హస్తర్ దాడి చేస్తాడు. అప్పుడు వారికి హస్తర్ శాపం తగులుతుంది. శాపమేంటంటే చావు అనేది రాకుండా జీవితాంతం జీవచ్ఛవంలా బ్రతకడమే…!
ఆ కుటుంబంలోని ఒక ముసలావిడకు హస్తర్ శాపం తగులుతుంది. ఆ ముసలావిడి మనవడే వినాయకరావు. తుంబాడ్ లోని పరిస్థితులు కారణంగా చిన్నప్పుడే వినాయకరావుని వాళ్ళ అమ్మ వేరే ప్రాంతానికి తీసుకుపోతుంది. అయితే చిన్నప్పటినుండి హస్తర్ బంగారం మీద ఆశ పెంచుకున్న వినాయకరావు పెద్దయ్యాక తిరిగి తుంబాడ్ కి వస్తాడు. అప్పటివరకు హస్తర్ శాతం తగిలిన ముసలావిడ బతికే ఉంటుంది.
ఆమె వద్ద హస్తర్ బంగారం ఎలా దక్కించుకోవాలో వినాయకరావు తెలుసుకుంటారు. అప్పటినుండి తుంబాడ్ కి వస్తు హస్తర్ వద్ద బంగారాన్ని తీసుకు వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో వినాయకరావు తన కొడుకుని తంబాడ్ కి తీసుకు వస్తాడు. అప్పుడు తన కొడుకుకి మరింత బంగారాన్ని దక్కించుకోవాలమే దురాశ పుడుతుంది. ఈ క్రమంలో తండ్రికి ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ ఏంటి? అది వర్క్ అవుట్ అయిందా లేదా? అనేది తెలుసుకోవాలని పూర్తిగా తుంబాడ్ సినిమా చూడాలి. 1947 నుంచి మూడు తరాల మధ్య జరిగే ఈ కథను మేకర్స్ ఆద్యంతం ఉత్కంఠ కలిగించే లాగా రూపొందించారు.
కేవలం గంట 40 నిమిషాలు మాత్రం ఉండే ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టించకుండా సాగుతుంది. పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. అయితే తాజాగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని ఒక ఇంటర్వ్యూలో పొగిడారు. మాస్టర్ క్లాస్ మూవీ అంటూ చెప్పుకొచ్చారు ఆయన చెప్పిన దగ్గర నుండి అంతగా ఈ సినిమాలో ఏముంది అంటూ చాలామంది ఈ సినిమాని చూడడం మొదలుపెట్టారు. ఈ సినిమాని మీరు చూడకపోతే ఒకసారి చూడండి. చాలా థ్రిల్ ఫీల్ అవుతారు
End of Article