అసలు ఏంటి ఈ సినిమా..? నాగార్జున రీమేక్ చేసే అంతగా ఏం ఉంది ఇందులో..?

అసలు ఏంటి ఈ సినిమా..? నాగార్జున రీమేక్ చేసే అంతగా ఏం ఉంది ఇందులో..?

by kavitha

Ads

అక్కినేని నాగార్జున గత కొన్ని నెలలుగా తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఆయన ఫ్యాన్స్ నాగార్జున పుట్టినరోజున అనౌన్స్ మెంట్ ఏమైనా వస్తాయేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఊహించినట్టుగానే ఆయన బర్త్ డే సందర్భంగా నాగార్జున తదుపరి సినిమాల ప్రకటనలు వచ్చాయి.

Video Advertisement

ఇందులో కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమా ఒకటి. ఆ చిత్రంకు ‘నా సామి రంగ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటుగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ అని తెలుస్తోంది. మరి ఆ మూవీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ‘నా సామి రంగ’ పై అధికారికంగా ప్రకటన ఇస్తూ, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో విజయ్ బిన్నీను డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘పొరింజు మరియమ్ జోస్’ మూవీకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పోరింజు మరియం జోస్ మూవీ 2019లో విడుదల అయ్యింది. ఈ మూవీకి జోషి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో  జోజు జార్జ్, నైలా ఉష, చెంబన్ వినోద్ జోస్ లు టైటిల్ రోల్స్ ను పోషించారు. త్రిసూర్‌లో 1980-1990ల మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, పోరింజు(జోజు జార్జ్), మరియం(నైలా ఉష), జోస్(జోజు జార్జ్), ముగ్గురు చిన్నప్పటి నుండి స్నేహితులు, కలిసి చదువుతుంటారు. అయితే  పోరింజు మరియంను ప్రేమిస్తాడు.
కానీ ఆమె తండ్రి బాగా డబ్బున్నవాడు కావడంతో పోరింజు, జోస్ లతో స్నేహం చేయవద్దని చెప్తాడు. అయితే మరియం కూడా పోరింజు ప్రేమిస్తుంది, కానీ అపార్థాల వల్ల వారు విడిపోతారు. ఇరవై ఏళ్ల తరువాత పొరింజు కసాయిగా పనిచేస్తుండగా, మరియం వడ్డీ వ్యాపారి అవుతుంది. జోస్, పోరింజులు ఎప్పటిలానే స్నేహితులు కొనసాగుతారు. ఆ గ్రామ చర్చిలో జరిగే పండుగలో జరిగిన ఒక సంఘటన వీరి ముగ్గురి జీవితాలను ఎలా మార్చింది అనేది కథ. ఇక ‘నా సామి రంగ’ సినిమాలో తెలుగు నెటీవీటికి తగ్గట్టుగా అనేక మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజ్ కానుంది. హీరోయిన్, తదితర వివరాలను త్వరలో ప్రకటించనున్నారని తెలుస్తోంది.

Also Read:  సైలెంట్ గా రిలీజ్ అయ్యి ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది..! ఈ సినిమా చూశారా..?

 


End of Article

You may also like