Ads
- ఇటీవల కాలంలో మలయాళ చిత్రాలు ఎక్కువగా తెలుగులోకి డబ్ అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అవుతుంటే, మరికొన్ని ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఆసక్తికరంగా సాగే కథ మరియు కథనాలను మనసుకు హత్తుకునేలా తెరకెక్కుతోన్న ఈ చిత్రాలు తెలుగు ఆడియెన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రాలకు ఓటీటీల్లో భారీగా రెస్పాన్స్ వస్తోంది. 2018 మూవీ, లేటెస్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన నెయ్‌మార్ చిత్రాలకు భారీ స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ‘పద్మిని’ అనే మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
మలయాళ హీరో కున్‌చకో బొబన్ మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితుడే. కున్‌చకో బొబన్ హీరోగా నటించిన మలయాళ మూవీ ‘పద్మిని’ జులై 14న థియేటర్లలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సెన్నా హెగ్డే తెరకెక్కించారు. ఈ మూవీలో మడోన్నా సెబాస్టియన్, అపర్ణా బాలమురళి, విన్సీ అలోషియస్, సజిన్, మాళవిక మేనన్ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఒక కాలేజీలో రమేష్ (కున్‌చకో బొబన్) ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తుంటాడు. అతను కథలు కూడా రాస్తుంటాడు.
రమేష్ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడతాడు. కానీ మొదటి రాత్రే రమేష్ భార్య లవ్ చేసిన వ్యక్తితో వెళ్లిపోతుంది. ఆ తరువాత రమేష్ తల్లిదండ్రులు అతనికి రెండవ పెళ్లి చేయాలని భావిస్తారు. దానికి రమేశ్ కూడా ఒప్పుకోవడంతో పెళ్లి సంబంధం చూస్తారు. అయితే ఆ అమ్మాయి పేరెంట్స్ రమేష్ కు అధికారికంగా విడాకులు వస్తేనే తమ కూతురుని ఇస్తామని షరతు పెడతారు. అయితే భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియని రమేశ్ ఆమెను ఎలా వెతికి, పట్టుకున్నాడు? ఆమెను వెతికే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? రమేష్ కు లాయర్ (అపర్ణా బాలమురళి) ఎలా సహాయం చేసింది. చివరికి రమేష్ రెండవ పెళ్లి చేసుకున్నాడా? లేదా ఇంతకీ కథలో పద్మిని ఎవరు? అనేది మిగతా కథ. లోపల బాధను ఉంచుకుని, పైకి బాధ కనిపించకుండా నవ్వుతూ కనిపించే రమేశ్ క్యారెక్టర్ లో కున్‌చకో బొబన్ ఒదిగిపోయారు. లాయర్ గా అపర్ణ బాలమురళీ నటన బాగుంది. సజిన్ కామెడీ టైమింగ్, మడోన్నా సెబాస్టియన్, విన్సీ అలోషియస్, మాళవిక మేనన్, అలరిస్తారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. విజువల్స్ బాగున్నాయి. అనుకున్న స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ సెన్నా హెగ్డే సక్సెస్ అయ్యాడు.
Video Advertisement
Also Read: అసలు హీరోయిన్ కంటే సైడ్ హీరోయిన్ కె ఎక్కువ ఫిదా అయ్యారు గా..! ఈ కామెంట్స్ చూడండి..!
End of Article