Ads
హీరోయిన్ రెజీనా కాసాండ్రా గతంలో పలు హిట్ చిత్రాలలో నటించి, గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలం నుండి సెలెక్టెడ్‌గా, లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోనే ఎక్కువగా నటిస్తోంది. శాకినీ డాకినీ, కాజల్ అగర్వాల్‌తో కలిసి కార్తీక అనే సినిమాలో నటించింది.
Video Advertisement
రెజీనా నటించిన మూవీ ‘నేనేనా’ ఆగస్టు 25న థియేటర్లలో విడుదల అయ్యింది. కోలీవుడ్ లో తెరకెక్కిన ‘సూర్పనగై’ కు నేనేనా తెలుగు వెర్షన్. పీరియాడికల్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఆర్కియాలజిస్టుగా దివ్య (రెజీనా కసండ్రా) పురావస్తుశాఖలో పని చేస్తుంటుంది. నల్గొండ సమీపంలోని అడవిలో టూరిస్ట్ గా వచ్చిన విదేశీయుడు మాయమవుతాడు. అయితే అతను అడవిలోని ఊబిలో చిక్కుకుని మరణించాడని పోలీసులు గుర్తిస్తారు. అయితే డెడ్ బాడీ దొరకదు. దాంతో ఆర్కియాలజిస్టు దివ్య సహాయం తీసుకుంటారు. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసే రాజా(వెన్నెల కిషోర్) సహాయంతో దివ్య అడవిలో పాతి పెట్టిన డెడ్ బాడీ స్కెలిటన్ ని వెలికితీసి పోలీసులకు అందజేస్తుంది.
కానీ ఫారెన్సిక్ పరిశోధనలో ఆ అస్థిపంజరం చనిపోయిన విదేశీయుడిది కాదని, చాలా ఏళ్ల క్రితం చనిపోయిన దమయంతి(రెజీనా )కి సంబంధించిందని నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత దమయంతి డీసీపీని మరియు అతని తమ్ముడిని చంపుతుంది. అసలు దమయంతి ఎవరు? దివ్యకి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? డీసీపీని, అతని తమ్ముడిని దమయంతి ఆత్మ ఎందుకు చంపింది? అడవిలో అదృశ్యం అయిన విదేశీయుడు ఎవరు? అనేది మిగతా స్టోరీ.
రెజీనా కసండ్రా దివ్య, దయమంతిగా రెండు డిఫరెంట్ కోణాలు ఉన్న క్యారెక్టర్ లో నటించింది. జమీందారి ఫ్యామిలీకి చెందిన దయమంతిగా దర్బం, హోదాతో నటించింది. దివ్య పాత్రతో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ లో మొదట్లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత రొటీన్ హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా కొనసాగింది.
End of Article