Ads
గత కొంత కాలం నుండి మిడిల్ క్లాస్ అనే కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వస్తున్నాయి. పేరుకి మాత్రమే సినిమాలో మిడిల్ క్లాస్. కానీ వాళ్ళు చేసే పనులు కానీ, మిగిలిన ఏ విషయాలు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఉండవు. మిడిల్ క్లాస్ అంటే కేవలం బట్టలు, లేదా వాళ్ళు ఉండే ఇల్లు మాత్రమే కాదు. వాళ్ళ ప్రవర్తన విధానం. నిజంగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే విధానం ఎలా ఉంటుంది. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టే లిమిట్ ఎంత. ఒకవేళ ఎప్పుడైనా సరే కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చు అయితే తర్వాత దాన్ని సర్దుబాటు చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.
Video Advertisement
ఇవన్నీ కూడా చూపించాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే పిసినారులు అని కాదు. పొదుపు చేసే వాళ్ళు అని. ఇద్దరికీ చాలా తేడా ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎన్నో కలలు ఉంటాయి. పని వాళ్ళు ఉండే పరిసరాల వల్ల కలలు నెరవేర్చుకోలేకపోతారు. చిన్న వయసు నుండి తల్లిదండ్రులకు సహాయం చేయాలి అని అనుకుంటారు. ఒకవేళ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన వ్యక్తి బాగా చదువుకోకుండా, ఇతర వ్యాపకాల మీద ఆసక్తి ఉన్నవాడు అయితే అతను వాళ్ళకి ఆవారా అన్నట్టే లెక్క.
ఒకవేళ అతని ఆసక్తిని గమనించినా కూడా, మిడిల్ క్లాస్ వారు కాబట్టి, వారి దగ్గర ఆర్థిక స్తోమత అంత బాగా ఉండదు కాబట్టి, అతని ఆసక్తిని ప్రోత్సహించే స్థాయి కూడా ఉండదు. ఇవన్నీ కూడా సినిమాలో చూపించాలి. అప్పుడే మిడిల్ క్లాస్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇప్పటివరకు ఇలాంటివన్నీ చూపించిన సినిమా ఒకటి మాత్రమే. ఆ సినిమా గురించి ఇప్పటికి కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటించారు. విజేత. ఈ పేరుతో తర్వాత రెండు, మూడు సినిమాలు కూడా వచ్చాయి.
కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత సినిమా చూసిన వారికి మాత్రం కేవలం చిరంజీవి విజేత మాత్రమే గుర్తొస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏదో తెలియని బాధ. వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే మనకే ఆ ఇబ్బందులు వచ్చినంత బాధపడతాం. ఒక సీన్ లో చిరంజీవికి డబ్బులు పోతాయి. ఆ సమయంలో చిరంజీవి పాత్ర పడే వేదన వర్ణాతీతం. దాన్ని తెరపై అంత బాగా చూపించారు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తుల జీవితాలని సినిమా రూపంలో తీయడం ఎలా అనే ప్రస్తావన వస్తే ఈ సినిమా ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. ఇలాంటి సినిమా మళ్లీ ఇప్పటివరకు తెలుగులో అయితే రాలేదు. ఎప్పటికీ కూడా రాదు ఏమో.
End of Article