Ads
సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. చాలా మంది సినిమాల ద్వారా మనం బయట మాట్లాడుకోలేని ఎన్నో విషయాల గురించి చెప్తూ ఉంటారు. మన సమాజంలో జరిగే ఎన్నో తప్పుడు పనుల గురించి సినిమాల్లో ప్రస్తావించి, వాటి వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది చూపిస్తారు.
Video Advertisement
అలాగే మానవ సంబంధాల గురించి కూడా సినిమాల్లో చాలా బాగా చూపిస్తారు. ఎంత సొంత వారు అయినా సరే, వారు చేసే పనుల వల్ల వేరే వారికి ఇబ్బంది కలగడం, అహంకారం వల్ల ఇంకా గొడవలు పెరగడం, అవి చాలా దూరం వెళ్లడం వంటివి నిజజీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి.
ఇవి ఎంత దూరం వెళ్తాయి అంటే, కొన్ని సార్లు అవతల వ్యక్తి ప్రాణాల మీదకి కూడా ఆ గొడవ వెళ్తుంది. ఇలాంటి గొడవల్లో గృహహింస ఒకటి. ఎన్నో తరాల నుండి గృహహింస జరుగుతూనే ఉంది. తరతరాలు మారుతూ ఉంటే, ఈ విషయం తగ్గినా కూడా పూర్తిగా అయితే పోలేదు. ఏదో ఒక రకంగా ఇంట్లో ఆడవారు ఇలాంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటున్నారు. ఈ విషయంపై సినిమాలు కూడా చాలా వచ్చాయి. అందులో చాలా సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తే, కొన్ని సినిమాలకి మాత్రం అంత పెద్దగా స్పందన రాలేదు.
కానీ ఇలా గృ-హహిం-స మీద వచ్చిన చాలా సినిమాలు ఇప్పటికీ కూడా చాలా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలాగా ఎంతో మంది దర్శకులు తీశారు. ఇలా గృ-హహిం-స మీద వచ్చిన మరొక సినిమా అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఆ సినిమా పేరు జయ జయ జయ జయ జయహే. ఇది మలయాళంలో రూపొందించిన సినిమా. దీన్ని ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేశారు.
మలయాళంలో 2022 లో థియేటర్లలో రిలీజ్ అయ్యి ఎంతో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా, ఆ తర్వాత ఓటీటీలో కూడా ఇతర భాషల్లో ఉండడంతో అందరూ చూసి చాలా మెచ్చుకున్నారు. ఇంక కథ విషయానికి వస్తే, జయ అనే ఒక అమ్మాయి చిన్నప్పటినుండి కూడా ఇంట్లో వివక్షకు గురి అవుతుంది. తన అన్నని ఎంతో బాగా చూసుకున్న ఇంట్లో వారు, తనని మాత్రం ఆడపిల్ల అనే ఒక తక్కువ ఆలోచనతో చూస్తారు.
చదువుకుంటూ ఉన్నప్పుడు కూడా తన లెక్చరర్ మాట్లాడే మాటలు విని చాలా మంచి ఆలోచన ఉన్న వ్యక్తి అని ప్రేమిస్తుంది. కానీ ప్రేమించాక అతని ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. అతను కూడా ఆడపిల్ల అని చులకనగా చూడడం మొదలుపెడతాడు. ఇదంతా ఇంట్లో తెలియడంతో జయకి రాజేష్ అనే ఒక వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేస్తారు. మొదట్లో మామూలుగానే ఉన్న రాజేష్ తర్వాత కొట్టడం మొదలు పెడతాడు. చిన్న చిన్న విషయాలకి కూడా కొడుతూ ఉంటాడు. దాంతో విసిగిపోయిన జయ ఎదురు తిరిగి రాజేష్ ని కొడుతుంది.
అప్పుడు జయ ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి? ఇదంతా తెలుసుకున్న కుటుంబం వాళ్ళు ఏం చేశారు? దీని చుట్టూ సినిమా తిరుగుతుంది. సినిమా కథ వింటూ ఉంటే చాలా సీరియస్ గా నడిచే సినిమా ఏమో అని అనిపిస్తుంది. అలా అనుకుంటే మాత్రం పొరపాటే. సినిమా కామెడీగా ఉంటూనే వీటన్నిటి చుట్టూ తిరుగుతుంది. అసలు ఇలాంటి ఒక సమస్యని తెరపై చూపించడమే పెద్ద విషయం అంటే, అది మరీ చూసే ప్రేక్షకులకు హెవీ అవ్వకుండా, ఎమోషనల్ గా కాకుండా కామెడీగా చూపించడం అనేది చాలా గొప్ప విషయం.
అందుకే సినిమా చూసినవారు అందరూ కూడా సినిమాని చాలా ప్రశంసించారు. అందులోనూ ముఖ్యంగా జయ పాత్రలో నటించిన దర్శన రాజేంద్రన్ నటనకి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. ఒక పక్క గంభీరంగా ఉంటూనే, మరొక పక్క భార్యకి భయపడే రాజేష్ పాత్రలో బాసిల్ జోసెఫ్ నటించారు. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంది. మలయాళం సినిమాలు అంటేనే సాధారణంగా సహజంగా ఉంటాయి. అది కూడా ఇలాంటి విషయంపై సినిమా రావడంతో దానికి ఇంకా మంచి రెస్పాన్స్ లభించింది.
ALSO READ : “ఆదిపురుష్” సినిమాలో “ఇంద్రజిత్” గా నటించిన అతను ఎవరో తెలుసా..? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..?
End of Article