Ads
ప్రస్తుతం థియేటర్ లో రిలీజ్ అయిన మహా అయితే నెల అంటే లేదు రెండు నెలలు లోపు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. కొన్ని సినిమాలు అయితే వారం రోజులకే ఓటీటీ లో దర్శనమిస్తున్నాయి అనుకోండి అది వేరే విషయం.కానీ ఒక సినిమా మాత్రం రెండెళ్ళ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. పలు అవార్డులు దక్కించుకున్న ఈ సినిమా పైన అందరికీ ఆసక్తి పెరుగుతుంది ఇంతకీ ఏ సినిమా అంటే..!
Video Advertisement
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా మంచి క్రియేట్ ఉంది. డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కలిసి ఓ నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. అందులో తీసిన సినిమానే పెబ్బల్స్. 2021 లో పలు అవార్డులు దక్కించుకుని ఆస్కార్ కూడా నామినేట్ అయింది. అస్కర్ రాకపోయినా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు మాత్రం దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 27న సోనీ లీవ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది.
కథేంటంటే:
వేలు (చెల్లంపాండే) స్కూల్ కి వెళ్లే కుర్రాడు. ఇతని తండ్రి (కరుత్తాడియన్) తాగుబోతు. ఇతడి బీర తాగుడు తట్టుకోలేక భార్యా తన కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. దీంతో భార్య కూతుర్ని తీసుకొచ్చేందుకు కొడుకుని తీసుకుని తండ్రి వెళ్తాడు. అలా తండ్రి కొడుకులు కలిసి చేసిన ఈ జర్నీలో ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు. చివరికి వేలు తల్లి చెల్లిని కలిసాడా, వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాడా లేదా అనేది మెయిన్ పాయింట్.
దర్శకుడు పీఎస్ వినోద్ రాజ్ ఈ సినిమాని తీశాడు. 2017లో ఇతడి అక్కని బావ ఇంట్లో నుంచి బయటకు తోసేసాడు. దీంతో ఆమె దాదాపు 13 కిలోమీటర్లు నడిచి వచ్చి పుట్టింటికి చేరుకుంది. ఈ సంఘటన తర్వాత పెబ్బల్స్ ఆలోచన వచ్చింది. ఈ మూవీ చాలా రియలిష్టిక్ గా ఉండడం కొన్ని గగుర్పాటు కల్పించే సీన్లు ఉన్నప్పటికీ మనసును హత్తుకుంటుంది. 2021 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు కానీ థియేటర్లో రిలీజ్ చేయలేదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీడీలోకి తీసుకొస్తున్న మూవీ లవర్స్ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న ఈ మూవీలో ఏమి ఉందా అంటూ ఆసక్తి కనబరుస్తున్నారు.
Watch Trailer:
End of Article