విచిత్రమైన సినిమా… అంతకంటే వింతగా ఉన్న హీరో పాత్ర..! ఈ సినిమా చూశారా..?

విచిత్రమైన సినిమా… అంతకంటే వింతగా ఉన్న హీరో పాత్ర..! ఈ సినిమా చూశారా..?

by kavitha

Ads

ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తుంటే, మలయాళ ఇండస్ట్రీలో మాత్రం వారి నేటివిటీకి దగ్గరగా, సహజత్వంతో కూడిన చిత్రాలను తీస్తున్నారు. ఆ క్రమంలో వచ్చిన చిత్రం ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’.

Video Advertisement

ఈ మూవీ థియేట్రికల్ గా విజయం సాధించింది. దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుని, విమర్శకుల ప్రశంసలు  అందుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. మరి ఈ చిత్రం ఎందుకు అంతగా పేరు తెచ్చుకుందో ఇప్పుడు చూద్దాం..
Mukundan-Unni-Associatesవినీత్ శ్రీనివాస‌న్ హీరోగా తెరకెక్కిన ‘ముకుంద‌న్ ఉన్ని అసోసియేట్స్’ మ‌ల‌యాళంలో భారీ విజ‌యాన్ని సాధించింది. క్రైమ్ కామెడీ క‌థాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ముకుంద‌న్ ఉన్ని (వినీత్ శ్రీనివాస‌న్‌) లాయర్. కేసుల కోసం అతను చేసే ఏ ప్రయత్నాలు కూడా ఫలించవు. మరోవైపు లాయ‌ర్ వేణు (సూర‌జ్‌) యాక్సిడెంట్‌ అయిన వ్య‌క్తుల‌కు నకిలీ పత్రాలతో ఇన్సురెన్స్‌ క్లెయిమ్‌ చేస్తూ బాగా డ‌బ్బు సంపాదిస్తుంటాడు. ముకుంద‌న్ కూడా వేణులానే మనీ సంపాదించేందుకు ప్ర‌య‌త్నిస్తాడు.వేణు యాక్సిడెంట్ కేసుల‌ను క్లెయిమ్ చేసే మెర్క్యూరీ హాస్సిట‌ల్ నే ముకుంద‌న్ కూడా ఎంచుకుంటాడు. వేణుతో పోటీని త‌ట్టుకోవడం క‌ష్టం కావ‌డంతో ఒక ప్లాన్ వేసి వేణుని ముకుంద‌న్ చంపేస్తాడు? వేణు చనిపోయిన త‌ర్వాత ఏమైంది? లాయ‌ర్‌గా డ‌బ్బు, పేరు సంపాదించడం కోసం చెడు దారిని ఎంచుకున్న ముకుంద‌న్‌కు ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదుర‌య్యాయి? జీవితంలో స‌క్సెస్ కావాల‌నే ముకుంద‌న్‌ క‌ల నెరవేరిందా? తాను ప్రేమించిన మీనాక్షిని( ఆర్ష చాందిని) ముకుంద‌న్ వివాహం చేసుకున్నాడా? అనేది మిగిలిన క‌థ‌.
ఈ మూవీలో హీరో మరియు విల‌న్ రెండు వినీత్ శ్రీనివాస‌న్. ముకుంద‌న్ ఉన్ని క్యారెక్టర్ లో వినీత్ జీవించాడు. అర్ష చాందిని మీనాక్షిగా పాత్ర‌కు తగినట్టుగా చేసింది. హీరోతో పాటు మూవీలోని ప్ర‌తి పాత్ర నెగెటివ్ షేడ్స్ లోనే ఉంటుంది. ఎదుటివారి వీక్ పాయింట్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కొంద‌రు లైఫ్ లో ఎలా పైకి వ‌స్తారనేది ఈ మూవీలో ఆలోచ‌నాత్మ‌కంగా చూపించారు.

Also Read: గుర్తింపు తెచ్చిన సినిమా టైటిల్ నే తమ పేరుకి యాడ్ చేసుకున్న 12 మంది సినీ సెలబ్రిటీస్.!


End of Article

You may also like