Ads
ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా, మిస్టర్ నూకయ్య డైరెక్టర్ అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘హిడింబ’. ఈ మూవీని గంగపట్నం శ్రీధర్ నిర్మించగా, నిర్మాత అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సమర్పించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నందిత శ్వేత నటించింది.
Video Advertisement
ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 20న రిలీజ్ అయ్యి, యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అశ్విన్, నందిత శ్వేతలు పోలీస్ ఆఫీసర్లుగా నటించిన ఈ మూవీ తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. కొత్త తరహ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, హైదరాబాద్‌లో అమ్మాయిలు వరుగా అపహరణకు గురవుతుంటారు. సుమారు 16 మంది కనిపించకపోవడంతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం కేరళ నుండి ఐపీఎస్ ఆద్య (నందితా శ్వేతా)ను సిటీకి రప్పిస్తారు. అప్పటికే ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసు ఆఫీసర్ అభయ్ (అశ్విన్ బాబు) తో పాటు ఆద్య కూడా విచారణ మొదలుపెడుతుంది.
తప్పిపోయిన అమ్మాయిలకు ఏమైంది? అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ కేసుకు అండమాన్ దీవుల్లో నివసించే గిరిజన తెగ హిడింబాలకు ఉన్న సంబంధం ఏంటి? ఆద్య, అభయ్ ఈ కేసును చేధించారా? అనేదే మిగతా కథ. ఎంచుకున్న కథ ఎంత గొప్పది అయినా, ఎంత క్రియేటివ్‌గా చూపించినా ఆడియెన్స్ కి అర్థం కాకపోతే ఆ మూవీతో కనెక్ట్ కాలేరు. ఈ మూవీలో అదే జరిగింది.
నిజానికి ఈ మూవీ కాన్సెప్ట్ కొత్తది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపిస్తూ, వర్తమానంలో జరిగే సీన్స్ చూపించడంతో స్టోరీ ఎక్కడ నడుస్తుందో అర్థం కాకపోవడం ఆడియెన్స్ ను గందరగోళానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్ సన్నివేశం సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ ను పెంచుతుంది.
అసలు స్టోరీ సెకండాఫ్‌లో చూపించారు. హిడింబ తెగ నేపథ్యం, హైదరాబాద్ లో జరుగుతున్న కిడ్నాపులకు, హిడింబ తెగకు కనెక్షన్ ఉండడం, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేస్తుంది. అయితే డైరెక్టర్ పలు చోట్ల సినిమాటిక్ లిబర్టీ ఉపయోగించుకున్నాడు. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చుతుంది.
Also Read: OMG 2 REVIEW : ఈ “అక్షయ్ కుమార్” సినిమా అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article