Ads
సినిమా జనాలకి ఎక్కువగా రీచ్ అవ్వాలి అంటే టైటిల్ అనేది చాలా ముఖ్యం. ఒక సినిమా పేరు ఎంత క్యాచీగా ఉంటే ప్రేక్షకుల దృష్టిలో అంత ఈజీగా పడుతుంది. అందుకే సినిమా టైటిల్స్ చాలా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటారు. అలాగే టైటిల్ సినిమా కథకు తగ్గట్టు ఉండడం కూడా ఎంతో ముఖ్యం. అలా కొన్ని సినిమాలు ముందు ఒక పేరుతో మొదలయ్యే తర్వాత పేరు మారాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 మిర్చి
మిర్చి సినిమా పేరు మొదట “వారధి” అని అనుకున్నారు. తర్వాత మిర్చి గా మార్చారు.
#2 అత్తారింటికి దారేది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది సినిమా పేరు ముందు “సరదా” అని అనుకున్నారు.
#3 స్పైడర్
సూపర్ స్టార్ మహేష్ బాబు – ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ సినిమా కి ముందు “ఏజెంట్ శివ” టైటిల్ గా అనుకున్నారు.
#4 అర్జున్ సురవరం
నిఖిల్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన అర్జున్ సురవరం సినిమా పేరు మొదటి “ముద్ర” అని అనౌన్స్ చేశారు. ఇదే పేరుతో కొన్ని పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. తర్వాత టైటిల్ తొందరగా రిజిస్టర్ అవ్వట్లేదు అని అర్జున్ సురవరం గా మార్చారు అని నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
#5 ఒక్కడు
ఒక్కడు సినిమాకి మొదట “అతడే ఆమె సైన్యం” అనే టైటిల్ అనుకున్నారు. తర్వాత ఒకడు అని చేంజ్ చేశారు.
#6 లైగర్
విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతున్న లైగర్ సినిమాకి మొదట “ఫైటర్” అనే టైటిల్ అనుకున్నారు.
#7 ఖుషి
ఖుషి సినిమాకి మొదట “చెప్పాలని ఉంది” అనే టైటిల్ అనుకున్నారు. తర్వాత ఖుషి గా మార్చారు.
#8 నాగవల్లి
చంద్రముఖి కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి మొదట “చంద్రముఖి-2” అనే టైటిల్ అనుకున్నారు.
#9 డియర్ కామ్రేడ్
ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలో ఒకసారి డైరెక్టర్ భరత్ కమ్మ మాట్లాడుతూ డియర్ కామ్రేడ్ సినిమా “డియర్ లిల్లీ” అనే టైటిల్ అనుకున్నారని చెప్పారు.
#10 100% లవ్
ఈ సినిమాకి సినిమాలో మహాలక్ష్మి ఎక్కువగా వాడే “దట్ ఈజ్ మహాలక్ష్మి” అనే పదం టైటిల్ అనుకున్నారు. ఇప్పుడు అదే పేరుతో తమన్నా హీరోయిన్ గా క్వీన్ రీమేక్ రాబోతోంది.
End of Article