Ads
కళాతపస్వి కె.విశ్వనాథ్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మర్చిపోలేని సినిమాలను తెరపైకి తీసుకువచ్చారు. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకునేవి. స్టార్ హీరోలు కూడా కమర్షియల్ గా ఆలోచించకుండా ఆయనతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపించేవారు. ఆయన సినిమాలతో ఎన్నో లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆయన ప్రతి సినిమాకి ఏదో ఒక అవార్డు వచ్చింది. అంతలా ఆయన సినిమాలు అవార్డుల జ్యురి మెంబర్స్ ని కూడా కదిలించాయి.
Video Advertisement
ఎన్నో కల్ట్ క్లాసిక్స్ లాంటి సినిమాలతో ప్రేక్షకులని మెప్పించడమే కాకుండా భావి దర్శకులకు ఒక మార్గదర్శకంగా నిలిచారు కె.విశ్వనాథ్. ఇక విశ్వనాథ్ సినీ జీవితంలో తీసిన మరపురాని చిత్రాలేవో ఇప్పడు చూద్దాం..
#1 శంకరాభరణం
1980 లో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమా తెలుగు బెస్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటి. సాంప్రదాయం సంగీత కళకు అద్దం పట్టేలా ఉండే ఆ సినిమా విడుదలైన అన్ని భాషల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంది. అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా శంకరాభరణం నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రం లో సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్ నటించారు. కెవి. మహదేవన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది.
#2 సాగర సంగమం
కళాతపస్వి తో చిత్రాలు చేసేందుకు స్టార్ హీరోలందరూ క్యూ కట్టేవారు. కమలహాసన్ స్వయంగా విశ్వనాధ్ దగ్గరకు వచ్చి ఆయనతో సినిమా చేస్తానని చెప్పారట. అలా ‘సాగర సంగమం’ చిత్రం చేసారు విశ్వనాథ్. అప్పట్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమలహాసన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.
#3 స్వాతి ముత్యం
ఆ తర్వాత వచ్చిన స్వాతి ముత్యం చిత్రం కూడా రికార్డ్స్ కొల్లగొట్టింది. 1985లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం ‘స్వాతిముత్యం’. పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నపుడే భర్త పోతే ఎదురుకున్న పరిస్థితులు ఇందులో చూపించారు. ఈ చిత్రం లో రాధికా, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
#4 స్వర్ణ కమలం
చిత్రకారుడైన యువకుడు తన పక్కింట్లో ఉండే బ్రాహ్మణ విద్వాంసుని కుమార్తెను నాట్యకళలో ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేర్చడమే ఈ సినిమా కథ. ఇందులో వెంకటేష్, భానుప్రియ అద్భుతంగా నటించి మెప్పించారు.
#5 స్వయంకృషి
కృషి, నైతికత, స్వావలంబన విలువలను పెంపొందించే గొప్ప కుటుంబ కథా చిత్రం ‘స్వయంకృషి’. ఈ సినిమాలో చిరంజీవి చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రలో నటించారు. చెప్పులు కుట్టుకునే సాధారణ వ్యక్తి ఆ తర్వాత ఎన్నో చెప్పులు దుకాణాలు ప్రారంభించి గొప్ప సంపన్న వ్యక్తిగా ఎలా మారతాడనేది ఈ సినిమాలో చూపించారు. అప్పటికే కమర్షియల్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్న చిరంజీవిని ఈ చిత్రం లో చెప్పులు కుట్టే వ్యక్తిగా చూపించడమంటే పెద్ద సామసమనే చెప్పాలి.
#6 శుభలేఖ
అప్పటికి సినిమాల్లో నిలదొక్కుకుంటున్న చిరంజీవికి ‘శుభలేఖ’ మంచి గుర్తింపు తెచ్చింది. వరకట్నానికి వ్యతిరేకం గా తెరకెక్కించిన ఈ చిత్రం లో సుమలత, చిరంజీవి అద్భుతంగా నటించారు.
#7 సిరివెన్నెల
1986లో విడుదలైన సంగీత ప్రాధాన్యతా చిత్రం ‘సిరివెన్నెల’. సర్వదమన్ బెనర్జీ, సుహాసిని జంటగా నటించారు. కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలన్నీ సీతారామ శాస్త్రి రాశారు. ఆ తర్వాత ఈ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది.
#8 స్వాతి కిరణం
‘స్వాతి కిరణం’ చిత్రం 1992లో విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. మమ్ముట్టి, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు.
#9 శ్రుతిలయలు
రాజశేఖర్, సుమలత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన శ్రుతిలయలు చిత్రానికి గాను విశ్వనాథ్ గారు బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్నారు.
#10 శుభ సంకల్పం
కమల్ హాసన్, ఆమని ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.
#11 ఆపద్భాంధవుడు
చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత తీసిన చిత్రం ఆపద్భాంధవుడు. ఈ చిత్రం లో మీనాక్షి శేషాద్రి హీరోయిన్ గా నటించారు.
#12 సప్తపది
కళాతపస్వి విశ్వనాథ్ తన సినిమాల్లో అన్నిభావాలను వ్యక్తపరచడానికి సంగీతాన్ని ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు. ఈ చిత్రం లో కూడా సినిమాలో త్యాగరాయ కీర్తన ద్వారా తన ప్రేమను, అందులో తన్మయత్వాన్ని, ఎదురుచూపును తెలియజేస్తుంది కథానాయక.
#13 సిరి సిరి మువ్వ
ఈ సినిమాతో దర్శకుడు విశ్వనాథ్ ప్రతిభ వెలుగులో వచ్చింది. ఒక మూగ యువతికి, అనాధ యువకుడికి మధ్య ఉన్న బంధాన్ని ఈ చిత్రం లో చూపించారు.
End of Article