Ads
డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు శ్రీదేవిని హీరోయిన్ గా పెట్టి చాలా సినిమాలు తీశాడు. అప్పట్లో అది రికార్డు ఆ తర్వాత చాలామంది హీరోయిన్స్ తో ఒకటి రెండు సినిమాలు తీశాడు కానీ హీరోయిన్ రమ్యకృష్ణతో మాత్రం చాలా సినిమాలు తీశాడు. అప్పట్లో వీళ్ళిద్దరి కాంబినేషన్స్ లో వచ్చిన చిత్రాలు మ్యూజికల్ గా కూడా పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి. వాళ్ళు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏంటో చూద్దాం.
Video Advertisement
#1. అల్లుడుగారు :
రాఘవేంద్రరావు, రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమాలో మోహన్ బాబు హీరో. మొదటి సినిమాతోనే తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది రమ్యకృష్ణ.
#2. అల్లరి మొగుడు:
రాఘవేంద్రరావు డైరెక్షన్లో రమ్యకృష్ణ హీరోయిన్ గా వచ్చిన రెండవ సినిమా అల్లరి మొగుడు. ఈ సినిమాలో మీనా కూడా మరో హీరోయిన్. ఈ సినిమాలో కూడా హీరో మోహన్ బాబు కావటం విశేషం. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్.
#3.అల్లరి ప్రియుడు:
రాజశేఖర్ హీరోగా రమ్యకృష్ణ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో మరో హీరోయిన్ మధుబాల. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
#4. మేజర్ చంద్రకాంత్:
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు నటించిన ఈ సినిమాలో మోహన్ బాబు, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్.
#5. ముగ్గురు మొనగాళ్లు :
చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ తో పాటు మీనా, రోజా కూడా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో యావరేజ్.
#6. అల్లరి ప్రేమికుడు:
జగపతిబాబు హీరోగా రంభ మరొక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
#7. ముద్దుల ప్రియుడు:
వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.
#8. రాజ సింహం :
రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణతోపాటు సౌందర్య మరొక హీరోయిన్ గా నటించిన అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
#9. ఘరానా బుల్లోడు:
నాగార్జున రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఆమని మరొక హీరోయిన్.
#10. అన్నమయ్య:
నాగార్జున ప్రధానోపాత్ర పోషించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే.
#11. లవ్ స్టోరీ1999:
ప్రభుదేవా,నవీన్ హీరోలుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి సినిమా ఇద్దరి మిత్రులు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో సాక్షిశివానంద్ ప్రధాన పాత్ర పోషించింది.
End of Article