Ads
ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ సినిమాలో సెకండ్ హీరోగా విరాజ్ అశ్విన్ నటించారు. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మూవీకి సి రాజేష్ దర్శకత్వం వహించారు.
Video Advertisement
ఈ చిత్రంలో హీరోయిన్ ను నెగెటివ్ గా చూపించారు. అయితే ఇలాంటి సినిమాలు అంటే హీరోయిన్ ను నెగెటివ్ గా చూపించిన సినిమాలు గతంలో ఎక్కువగానే వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం చిత్రాలు విజయం సాధించాయి. అయితే కథానాయకను నెగటివ్ షేడ్స్ లో చూపించిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. బేబీ:
చిన్నప్పటి నుండి ప్రేమించిన వ్యక్తిని మోసం చేసే పాత్రలో హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించింది. 2. ఆర్ ఎక్స్ 100:
కార్తికేయ హీరోగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ హీరోని ప్రేమించి, మోసం చేసే ఇందు అనే పాత్రలో నటించింది.
3. డిజే టిల్లు:
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రంలో రాధికగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నేహాశెట్టి నటించింది.
4. రారండోయ్ వేడుక చూద్దాం:
నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీలో రకుల ప్రీత్ సింగ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.
5. మన్మధ:
శింబు హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోని మోసం చేసే వైష్ణవి అనే పాత్రలో సింధు తులానీ నటించింది.
6. నీవెవరో:
ఆదిపినిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీలో తాప్సీ కళావతి అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.
7. వల్లభ:
శింబు, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో ప్రేమించిన హీరోని ఇబ్బంది పెట్టె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రీమా సేన్ నటించింది.
8. శుభలగ్నం:
శుభలగ్నం సినిమాలో డబ్బు కోసం భర్తనే అమ్ముకునే పాత్రలో హీరోయిన్ ఆమని నటించింది.
9. ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు:
ఈ చిత్రంలో హీరోయిన్ రమ్యకృష్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న శిరీష పాత్రలో నటించింది.
10. ప్రేమించాను నిన్నే:
ఈ చిత్రంలో మంజుల కుమార్తె హీరోయిన్ శ్రీదేవి హీరోని మోసం చేసే పాత్రలో నటించింది.
11. ధర్మయోగి:
హీరోయిన్ త్రిష రుద్ర అనే పాత్రలో ప్రేమించిన హీరోనే చంపే పాత్రలో నటించింది.
12. గుండెల్లో గోదారి:
హీరోయిన్ తాప్సీ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న సరళ అనే పాత్రలో నటించింది.
13. బస్ స్టాప్:
ఈ చిత్రంలో ఆనంది నెగెటివ్ షేడ్స్ ఉన్న సీమా అనే పాత్రలో నటించింది.
14. సూర్య వంశం:
ఈ చిత్రంలో చదువు లేదని ప్రేమించిన హీరోని కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునే పాత్రలో సంఘవి నటించింది.
Also Read: నటకిరీటి “రాజేంద్ర ప్రసాద్” ఎంత గొప్ప నటుడో తెలిపే 10 సినిమాలు..! లిస్ట్‌లో ఉన్న సినిమాలు ఏవంటే..?
End of Article