బిగ్ బాస్ తెలుగు 6 “మెరీనా” నటించిన సినిమాలు ఏవో తెలుసా..??

బిగ్ బాస్ తెలుగు 6 “మెరీనా” నటించిన సినిమాలు ఏవో తెలుసా..??

by Anudeep

Ads

బిగ్ బాస్ సీజన్ 6 లో బుల్లితెర నటి మెరీనా, తన భర్త, సహా నటుడు అయినా రోహిత్ తో కలిసి పాల్గొంది. రోహిత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న మెరీనా తన భర్త తో కలిసి జంటగా బిగ్ బాస్ లో అడుగు పెట్టింది. మొదట్లో కలిసి గేమ్ ఆడిన వీరిద్దరూ, తర్వాత బిగ్ బాస్ ఆదేశం తో విడి విడిగా గేమ్ ఆడారు. హౌస్ లో మదర్ ఇండియా గా పేరు తెచ్చుకున్న మెరీనా 11 వ వారం లో ఎలిమినేట్ అయ్యింది.

Video Advertisement

 

ఇక మెరీనా పూర్తి వివరాల్లోకి వెళ్తే..మెరీనా అబ్రహం, రోహిత్ సాహ్ని మొదట ఓ సినిమాలో జంటగా నటించారు. అది విడుదల కాకున్నా.. వీళ్ల మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మెరీనా ‘ అమెరికా అమ్మాయి’ సీరియల్ తో చాలా ఫేమస్ అయ్యింది. తర్వాత ఉయ్యాలా జంపాల, సిరి సిరి మువ్వలు వంటి సీరియల్స్ లో నటించింది.

movies in which merina abraham accted..

2016 లో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ అనే చిత్రం తో వెండి తెరపై అడుగు పెట్టింది. తర్వాత ‘సబ్ కా దిల్ కుష్’ అనే హిందీ చిత్రం లోనూ మెరిసింది. 2017 లో టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ అవార్డు గెలుచుకుంది. మరోవైపు రోహిత్ ‘నీలి కలువలు’, ‘అభిలాష’ సీరియళ్లు చేశాడు.

movies in which merina abraham accted..

11వ వారం మెరీనా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమె గత రెండు మూడు వారాల క్రితం వరకు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానే హౌస్ లో నిలిచింది. మెరీనా ఇంట్లో ఎవరితోనూ పెద్దగా గొడవలు పెట్టుకోలేదు. అలాగే టాస్కుల విషయంలో కూడా మెరీనా పెద్దగా ప్రభావం చూపించింది లేదు. హౌస్ లో కూల్ గా ఉండేందుకే ప్రయత్నం చేసింది. దాదాపు అందరూ కూడా ఆమెతో పాజిటివ్ గానే ఉన్నారు.

movies in which merina abraham accted..

మెరీనా ఒక వారానికి 35 వేల వరకు రెమ్యునరేషన్ అందుకున్న మెరీనా మొత్తంగా 11 వారాలకు 3 లక్షల 80 వేల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


End of Article

You may also like