“అల వైకుంఠపురములో” తో పాటు… “పిల్లల్ని మార్చడం” అనే కాన్సెప్ట్‌తో వచ్చిన 4 సినిమాలు..!

“అల వైకుంఠపురములో” తో పాటు… “పిల్లల్ని మార్చడం” అనే కాన్సెప్ట్‌తో వచ్చిన 4 సినిమాలు..!

by kavitha

Ads

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ మూవీ మ్యూజికల్ గా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Video Advertisement

అయితే ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ లో అప్పుడే పుట్టిన ఇద్దరు పిల్లలను ఒకరి స్థానంలో మరొకరిని మారుస్తారు. ఈ కాన్సెప్ట్ తో గతంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో కూడా ఇదే కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కించారు. మరి ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..babies-changing-consept-movies1. సామజవరగమన:

తాజాగా రిలీజ్ అయిన సామజవరగమన సినిమా కూడా పిల్లలను మార్చే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో  శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించారు. సీనియర్ నరేశ్‌, శ్రీకాంత్‌, వెన్నెల కిశోర్‌ కీలకమైన పాత్రలలో నటించారు. 2. అన్నీమంచి శకునములే:

నందినిరెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని కూడా పిల్లలను మార్చే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. అయితే ఈ మూవీలో అప్పుడే  పుట్టిన పాప, బాబుని మారుస్తారు. ఈ మూవీలో సీనియర్ నరేశ్‌, రాజేంద్రప్రసాద్‌, రావురామేష్, గౌతమి నటించారు.
 3. అల వైకుంఠపురములో:

2020లో రిలీజ్ అయిన అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో కంపెనీ ఓనర్ రామచంద్ర భార్య, ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగి వాల్మీకి భార్య ఒకే హాస్పటల్ లో ఒకే సమయంలో ప్రసవిస్తారు.  ఉద్యోగి వాల్మీకి తన బిడ్డను రామచంద్ర బిడ్డ స్థానంలో పెట్టి, ఓనర్ బిడ్డను తన బిడ్డ స్థానంలోకి మారుస్తాడు.
4. ఇంటిగుట్టు:

1958 లో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా  పిల్లలను మార్చే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, సావిత్రి, గుమ్మడి, సూర్యకాంతం నటించారు.

Also Read: “పవన్ కళ్యాణ్ పాత సినిమాలన్నీ గుర్తొస్తున్నాయి..! అంటూ… పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ “బ్రో” టీజర్‌పై 15 మీమ్స్..!


End of Article

You may also like