Ads
ఇటీవల రిలీజ్ అయిన ‘బేబీ’ మూవీ మొదటి షోతొనే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ మూవీ టీనేజ్ లో ఏర్పడిన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం విజయం సాధించిన క్రమంలో గతంలో వచ్చిన టీనేజ్ ప్రేమకథ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
1. బేబీ:
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మరో హీరోగా విరాజ్ అశ్విన్ నటించారు. 2. బుట్టబొమ్మ:
మలయాళ మూవీ “కప్పెల”కు రీమేక్ గా తెలుగులో రూపొందిన సినిమా “బుట్టబొమ్మ”. ఈ మూవీలో అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలలో నటించారు.3. ఉప్పెన:
2021 లో విడుదలైన ఉప్పెన మూవీ ద్వారా పంజా వైష్ణవ్ తేజ్, కృతుశెట్టిలు హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఈ మూవీకి సానా బుచ్చిబాబు దర్శకత్వం చేయగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. 4. జూనియర్స్:
అల్లరి నరేష్, శేరిన్ జంటగా నటించిన జూనియర్స్ మూవీ 2003లో విడుదలైంది. ఈ మూవీకి జె. పుల్లారావు దర్శకత్వం వహించారు. 5. కొత్త బంగారు లోకం:
వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా కొత్త బంగారు లోకం. ఈ మూవీ 2008 లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు.
6. చిత్రం:
దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ మూవీలో ఉదయకిరణ్, రీమా సేన్ జంటగా నటించారు. 2000 వ సంవత్సరంలో ఈ మూవీ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. 7. ఎటో వెళ్లిపోయింది మనసు:
గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎటో వెళ్ళిపోయింది మనసు. ఈ మూవీలో నాని, సమంత జంటగా నటించారు. వీరి ప్రేమ టీనేజ్ నుండి మొదలవుతుంది.
8. జయం:
తేజ దర్శకత్వంలో 2002 లో రిలీజ్ అయిన మూవీ జయం. నితిన్, సదా జంటగా నటించగా, గోపీచంద్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీకి సంగీతం ఆర్. పి. పట్నాయక్ అందించాడు.
9. గంగోత్రి:
అల్లు అర్జున్, అదితి అగర్వాల్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఈ సినిమా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన 101వ మూవీ.
10. బస్ స్టాప్:
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమా బస్ స్టాప్. ఈ మూవీలో ప్రిన్స్ సిసిల్, శ్రీదివ్య, జంటగా నటించారు. ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మించారు.
11. బాయ్స్:
శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ బాయ్స్ . 2003 లో తెలుగులో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో సిద్ధార్ధ్, జెనీలియా జంటగా నటించారు.
12. నిర్మలా కాన్వెంట్:
హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేకా, శ్రియా శర్మ జంటగా నటించారు. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఈ మూవీకి జి. నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహించారు. 13. ప్రేమిస్తే:
భరత్, సంధ్య హీరో హీరోయిన్లు నటించిన సినిమా ప్రేమిస్తే. ఈ మూవీకి బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించగా, డైరెక్టర్ శంకర్ నిర్మించారు.
14. నువ్వు నేను:
తేజ దర్శకత్వంలో విడుదలైన ఈ మూవీలో ఉదయ్ కిరణ్, అనిత హీరో హీరోయిన్లుగా నటించారు. 2001 లో రిలీజ్ అయిన ఈ మూవీ ఘనవిజయం సాధించింది. 15. సీతాకోక చిలుక:
1981లో విడుదలైన ఈ మూవీకి భారతీరాజా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మురళి, ముచ్చర్ల అరుణ జంటగా నటించారు.
Also Read: నటుడు “మనోజ్” – స్మిత సంఘటనలో వెలుగులోకి వచ్చిన కొత్త విషయాలు..! అసలు వీరి పరిచయం ఎలా మొదలైంది అంటే..?
End of Article